టీడీపీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే.. వైకాపా మంత్రి బాలినేని షాకింగ్ కామెంట్స్
Jr Ntr : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏంటీ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవం అంత కూడా వయసు లేని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో వరుసగా చావు దెబ్బలు తింటున్నాడు. చంద్రబాబు నాయుడు తన పార్టీకి పునరుజ్జీవనం ఇవ్వాలని ఆశించిన ప్రతి సారి కూడా వైకాపా విజయాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చావు దెబ్బలు తీస్తూనే ఉన్నాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బలతో తెలుగు దేశం పార్టీ చతికిల్ల పడిపోయింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ పూర్తిగా చనిపోయిందని ఈ సమయంలో ఆ పార్టీకి ఊపిరి పోయాలంటే కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యం అవుతుంది అంటూ వైకాపా నాయకుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో తెలుగు దేశం పార్టీ మరింతగా కనుమరుగయ్యి పోయే కాలం ముందు ఉంది. ఏపీలో ప్రతి ఒక్క వర్గం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి నమ్మకంను కలిగి ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది. అందుకే చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ప్రజలు మాత్రం జగన్ మోహన్ రెడ్డినే ఆధరించారు. వైకాపాకు అద్బుతమైన అఖండమైన విజయాన్ని సొంతం చేశారని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ ను కనుక తీసుకు రాలేక పోతే ఆ పార్టీ మరింతగా పతనం అయ్యే అవకాశం ఉందంటున్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా తారక్ కు మాత్రమే తెలుగు దేశం పార్టీని నడిపించే సత్తా ఈ సమయంలో ఉందని రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎందుకు ఈ సమయంలో ఎన్టీఆర్ ను రంగంలోకి దించకూడదు అంటూ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నారు. పార్టీ మరింతగా నష్టపోక ముందే ఎన్టీఆర్ తో పార్టీ కోసం ఏదైనా ప్రకటన ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్బంగా తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఈ విపత్కర పరిస్థితి నుండి బయట పడేందుకు ఎన్టీఆర్ ను వినియోగించుకుంటాడా అనేది చూడాలి.