Bandaru Satyanarayana : రేణు దేశాయ్ ఛాన్సుల కోసం ఎవడెవడితోనో పడుకుంది అన్నప్పుడు మీ కళ్లు కాకులు దొబ్బాయా రాధిక ఖుష్బూ
Bandaru Satyanarayana : మీకు గుర్తుందా? ఒకప్పుడు ఏపీ మంత్రి రోజా.. రేణు దేశాయ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రేణు దేశాయ్ అవకాశాల కోసం ఎవడెవడితో పడుకుంది.. ఆమె ఒక సినీ ఆర్టిస్ట్. ఆమె ఎంతమందితో పడుకుందో కూడా తెలియజేయండి.. అంటూ రోజా చేసిన వ్యాఖ్యలను తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి గుర్తు చేశారు. బెయిల్ పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన బండారు.. తనపై విమర్శలు చేసిన ఖుష్బూ, రాధికపై కూడా మండిపడ్డారు. నన్ను న్యాయస్థానం ద్వారా లాగాలని చూశారు. కానీ.. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అక్రమ దుర్మార్గపు చర్యలు, అక్రమ కేసులు పెడుతున్నారు. మచ్చ లేని వ్యక్తి చంద్రబాబును కూడా అక్రమ కేసులో ఇరికించారు. సామాన్యులను కూడా హింసిస్తున్నారు. న్యాయదేవత నా పక్కన నిలబడింది. భువనేశ్వరి నిన్న నిరాహార దీక్ష చేశారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇంకా అమలులో ఉంది కాబట్టి కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతోంది.
ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారా? మా గొంతు నొక్కాలని చూస్తున్నారా? నీలాంటి దుర్మార్గపు చర్యలను అస్సలు చూస్తూ ఊరుకోం. మేము ఎప్పుడూ పొరపాటు చేయలేదు. ఎవ్వరి మీద అక్రమ కేసులు పెట్టలేదు. న్యాయంగా, నీతిగా బతికాం. నాన్ బెయిలబుల్ వారెంట్ లాగా సెక్షన్ల మీద పెట్టి హింసలకు గురి చేస్తారా? ధర్మం గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది. టీడీపీ గురించి జగన్ తెలుసుకోవాలి. మమ్మల్ని బెదిరించి నువ్వేం చేయలేవు. ఇంకో 5 మాసాలు ఉంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. దొంగ కేసులు పెట్టి ఇలా చేస్తావా? మా తల్లి భువనేశ్వరి మహిళ కాదా? మా తల్లిని అవమానించినప్పుడు నువ్వేం చేశావు. మహిళలు ఎవరైనా మహిళలే కదా. యూట్యూబ్ లో, టీవీలో నేను మాట్లాడిన తర్వాత కామెంట్స్ ఏం వచ్చాయో చదివి.. ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారో తెలుసుకోండి. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి.. అని బండారు మండిపడ్డారు.
Bandaru Satyanarayana : నా సంతకం ఫోర్జరీ అయిందని మీరెవరు చెప్పడానికి?
హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అయిందని వాళ్లు చెబుతున్నారు. నా సంతకం ఫోర్జరీ గురించి మీరు చెప్పడం ఏంటి అంటూ బండారు మండిపడ్డారు. నాకు మహిళలంటే గౌరవం. రోజా మీద మాట్లాడేటప్పుడు కూడా నేను నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పాను. మహిళలే మా పార్టీకి పట్టుగొమ్మలు. నిన్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఒక మహిళా మంత్రిగా మహిళలపైన అన్యతా పదాలు వాడుతుంటే.. ఒక రోజాగా.. ఒక మంత్రిగా నేను మాట్లాడాను తప్పితే.. మిగితా మహిళా మంత్రులపై నేను ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రోజాను మాత్రమే ఎందుకు అన్నాను. జగన్ గారు ముందు మీరు రోజాను కంట్రోల్ చేయండి.. అంటూ బండారు సూచించారు.