YS Sharmila : షర్మిల ఏపీకి వస్తే జగన్ పీఠం కదులుతుందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : షర్మిల ఏపీకి వస్తే జగన్ పీఠం కదులుతుందా ?

 Authored By kranthi | The Telugu News | Updated on :26 June 2023,1:00 pm

YS Sharmila : తెలంగాణలో పార్టీ పెట్టి ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలు చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి.. నిజంగానే షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారా? తెలంగాణతో పాటు ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేయనున్నారా? అనే దానిపై స్వయంగా వైఎస్ షర్మిలే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అవును.. ట్విట్టర్ వేదికగా ఆమె ఘాటు రిప్లయి ఇచ్చారు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. షర్మిల కాంగ్రెస్ చేరికపై తాజాగా స్పందించారు. కాంగ్రెస్ లో చేరడం కాదు.. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ పార్టీని విలీనం చేస్తున్నారు అనే వార్తలపై వైఎస్ కుటుంబం పుట్టిందే కాంగ్రెస్ లో అన్నట్టుగా భట్టి స్పందించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయి పాలన సాగించిందే కాంగ్రెస్ లోనే కదా. మరి ఆయన పాలన సాగించిన పార్టీలోని ఆయన కుటుంబం వస్తామంటే ఎవరు కాదంటారు. ఎవరు మాత్రం అభ్యంతరం చెబుతారు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైంది కానీ.. లేకపోతే ఆ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉండేవారు. ప్రస్తుతం షర్మిల పార్టీ విలీనం అంశం విషయం కూడా అధిష్ఠానమే చూసుకుంటుంది.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

bhatti vikramarka talks about ys sharmila

bhatti vikramarka talks about ys sharmila

YS Sharmila : కొన్ని పరిస్థితుల్లో ఆ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైంది

ఒకవైపు షర్మిల స్ట్రాంగ్ గా ట్విట్టర్ లో చెప్పడం.. మరోవైపు భట్టి విక్రమార్క అసలు షర్మిల పార్టీలో చేరే విషయం అధిష్ఠానం చూసుకుంటుంది అనడంలో ఎక్కడా పొంతన లేదు. నిజానికి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే షర్మిలతో టచ్ లో ఉన్నారట. కానీ.. తెలంగాణలో పార్టీ పెట్టి.. తెలంగాణ కోసమే పనిచేస్తా అని చెప్పుకొచ్చిన షర్మిల మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది