Akhila Priya : కర్నూలు జిల్లాలో రసవత్తర రాజకీయం.. విజయా డెయిరీ ఛైర్మన్‌కు భూమా అఖిల వార్నింగ్
Akhila Priya : ఏపీలో రోజు రోజుకి రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛైర్మన్ ఛాంబర్‌లో మాజీ సిఎం జగన్ చిత్రపటం ఉంచడంపై ఎండీని, సిబ్బందిని అఖిలప్రియ నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎందుకు […]
ప్రధానాంశాలు:
Akhila Priya : కర్నూలు జిల్లాలో రసవత్తర రాజకీయం.. విజయా డెయిరీ ఛైర్మన్‌కు భూమా అఖిల వార్నింగ్
Akhila Priya : ఏపీలో రోజు రోజుకి రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛైర్మన్ ఛాంబర్‌లో మాజీ సిఎం జగన్ చిత్రపటం ఉంచడంపై ఎండీని, సిబ్బందిని అఖిలప్రియ నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఛాంబర్‌లోని జగన్ చిత్రపటం తొలగించి.. సిఎం చంద్రబాబు ఫోటోను స్వయంగా ఏర్పాటు చేశారు.
Akhila Priya మామా కోడళ్ల వార్..
ఇలా మరలా జరగొద్దంటూ అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలిపెట్టబోమని.. అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్నూలు జిల్లా విజయా డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డితో గొడవకు దిగారు. ఫోన్‌లో బెదిరించారు. నిజానికి- ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి భూమా అఖిలప్రియ కోడలి వరుస అవుతారు. తన సీట్లో ఎలా కూర్చుంటావని ఎమ్మెల్యే అఖిలప్రియను ఎస్వీ జగన్ ప్రశ్నించారు. కార్యాలయ సిబ్బంది కూర్చోమంటే కూర్చుకున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. అయితే తనను అడగకుండా తన సీటులో కూర్చోవడానికి నువ్వెవరంటూ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు.
అందుకు అఖిల ప్రియ సమాధానం ఇస్తూ గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అని ప్రశ్నించారు. ‘ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం’ అని అఖిల ప్రియకు జగన్ సవాల్ విసిరారు. మామ, కోడలి మధ్య ఫోన్ సంభాషణ కర్నూల్ రాజకీయాల్లో కాకపుట్టిస్తుంది. మామగా ఫోన్ చేశావా? విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా? అంటూ భూమా అఖిలప్రియ మామ ఎస్వీ జగన్ ను ప్రశ్నించారు. తన మామగా ఫోన్ చేస్తే సరే కానీ, డెయిరీ ఛైర్మన్ గా ఫోన్ చేస్తే కంప్లైంట్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు అఖిలప్రియ. వైసిపి నాయకులు ఇంకా భ్రమలో బ్రతుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైరీలో అవినీతి అక్రమాలు చాలా జరుగుతున్నాయని.. అన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు