Ysrcp : మంత్రి పదవుల కోసం ఆశపడితే… ఉన్నది కాస్తా పాయే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : మంత్రి పదవుల కోసం ఆశపడితే… ఉన్నది కాస్తా పాయే…!

 Authored By sukanya | The Telugu News | Updated on :6 July 2021,10:59 am

Ysrcp  మంత్రిపదవిపై ఆశ.. ఏకంగా ఓ నలుగురు నేతల భవిష్యత్ నే దెబ్బకొట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తయారైంది. మంత్రిపదవి కోసం వేసిన రాంగ్ స్టెప్ భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చేసింది. ఇప్పుడు క‌క్కలేక మింగ‌లేక అన్న చందంగా వారి రాజకీయ జీవితం తయారైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌కు పసుపు  కండువాలు క‌ప్పేశారు. వీరిలో న‌లుగురికైతే, ఏకంగా మంత్రిపదవులు కూడా ఇచ్చారు. ఆ నలుగురు రెండేళ్లపాటు మంత్రులుగా ఓ రేంజ్ లో అధికారం వెల‌గ‌బెట్టారు. మంత్రులుగా వారు ఆయా జిల్లాల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. క‌ట్ చేస్తే రెండేళ్లలో వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడి చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో.. సొంత పార్టీలో కూడా ప‌ట్టు నిలుపుకునే ప‌రిస్థితిలో కూడా లేకుండా పోయారు. ఆ మాజీ మంత్రులు క‌డ‌ప జిల్లాకు చెందిన‌ ఆదినారాయణరెడ్డి, ఆళ్లగ‌డ్డకు చెందిన భూమా అఖిలప్రియ, బొబ్బిలి రాజు సుజయ కృష్ణరంగరావు, చిత్తూరు నేత అమర్నాథ్ రెడ్డి.

TDP

TDP

Ysrcp  మాజీలుగా మారిన మంత్రులు .. ఖాళీ

ఈ నలుగురు 2014లో వైసీపీ Ysrcp ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో భూమా అఖిల‌, అమ‌ర్నాథ్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీకి చెందిన వారే. సుజ‌య్‌, ఆది ఇద్దరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా గెలిచి 2014లో వైసీపీలోకి జంప్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌లుగురూ ఓడిపోయారు. వీరు మంత్రులుగా  ఉన్నంత కాలం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వాళ్లను అణ‌గ‌దొక్కడంతో పాటు టీడీపీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా ఆకాశంలోనే ఉన్నారు. దీంతో కనీసం వీరిని సొంత కేడర్ కూడా పట్టించుకోవడం లేదు. అందుకే సుజ‌య్‌, అమ‌ర్నాథ్ క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఉండడం లేదు.

Ysrcp

Ysrcp

ఏకంగా చెన్నై, బెంగ‌ళూరు వెళ్లిపోయి, తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక అఖిల‌ప్రియ వ‌రుస వివాదాల్లో ఇరుక్కోవ‌డంతో పాటు జైలుకు కూడా వెళ్లివ‌చ్చారు. ఆ టైంలో క‌నీసం ఆమెను పార్టీ నేత‌లు ప‌ట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ టీడీపీని వీడి సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారు. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏంటో తెలిసిందే. అక్కడ ఆదిని ప‌ట్టించుకునే వాళ్లు, న‌మ్మే వాళ్లు కూడా లేరు. దీంతో అక్కడ నామ్ కే వాస్తేగా ఉన్నట్లేనని టాక్ నడుస్తోంది.

twist in bowenpally kidnap case bhuma akhilapriya

twist in bowenpally kidnap case bhuma akhilapriya

Ysrcp  ఇక సుజయ, అఖిల .. సైలెంట్ మోడ్ లో

బొబ్బిలిలో సుజ‌య్‌ను త‌ప్పించేసిన చంద్రబాబు ఆయ‌న సోద‌రుడు బేబీ నాయ‌నకు టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించేశారు. సుజ‌య్ పొలిటిక‌ల్ లైఫ్‌కు శుభం కార్డే అంటున్నారు. అఖిల ఇదే తీరుతో ఉంటే ఆమె రాజ‌కీయంగా నిల‌దొక్కుకునే ప‌రిస్థితులు లేవు. ఇక ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో ఇబ్బంది  ప‌డుతున్నా, త‌ర్వాత అయినా ఆయ‌న టీడీపీలోకి రాకుండా పోతారా ? అనే వాళ్లే ఎక్కువ‌. మంత్రి పదవి మీద వ్యామోహంతో జంప్ చేసినా, కేడర్ ను పట్టించుకోకపోవడమే వీరికి పెద్ద దెబ్బ కొట్టిందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో నాడు వీళ్లు మంత్రి పదవి మీద ఆశ‌తో పార్టీ మార‌కుండా ఉండి  ఉండే ఈ రోజు ఐదేళ్ల పాటు అధికారం ఎంజాయ్ చేసేటోళ్లేనన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేడర్ కూడా కోల్పోవడంతో, ఇక వీరి రాజకీయాలకు శుభం కార్డు పడినట్లేనని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారట. ఈ నేపథ్యంలో మళ్లీ జంపింగ్ దిశగా ఆలోచిస్తున్నా, పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ నలుగురి భవిష్యత్ ఏమిటో .. వేచి చూడాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?..

ఇది కూడా చ‌ద‌వండి ==> త్వ‌ర‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవ‌రు సేఫ్‌… ఎవ‌రు ఔట్‌..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌గ‌న్ ను డీ కొట్ట‌డానికి టీడీపీ భారీ ప్లాన్‌.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది