Akhila Priya : సారీ అమ్మా అఖిలప్రియా, ఏమీ అనుకోకు ‘ బాబు ఇదే మాట చెప్పాడా ?

Authored By Himanshi | The Telugu News | Published on: February 4, 2021, 1:46 pm

Akhila Priya : కిడ్నాప్ కేసులో అరెస్ట్‌ అయ్యి బెయిల్ పై ఇటీవలే విడుదల అయిన అఖిల ప్రియ తెలుగు దేశం పార్టీకి గుడ్‌ బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఆమె కు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కోపంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో కొనసాగడం సేఫ్టీ కాదేమో అనే అభిప్రాయంతో అఖిల ప్రియ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమెతో ఫోన్‌ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడట. అయితే ఆయన మాటల ద్వారా ఆమెకు ఎలాంటి సాంత్వన కలిగినట్లుగా లేదు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆమె ప్రయత్నించిందట.

Akhila Priya కు అపాయింట్మెంట్‌ ఇవ్వని బాబు..

హైదరాబాద్ లో ఉన్న అఖిల ప్రియ బెయిల్‌ పై విడుదల అయిన వెంటనే చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించిందట. అందుకోసం అపాయిట్మెంట్ ఇవ్వమని అడిగిందట. ఒక మాజీ మంత్రి నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉంటుంది. కాని అఖిల ప్రియ విషయంలో మాత్రం అలా లేదు. ఆయన కావాలని అఖిల ప్రియను దూరం పెడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అఖిల ప్రియ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆమెను చంద్రబాబు నాయుడు కలవాలని అనుకోవడం లేదు.

chandra babu naidu no appointment for akhila priya last few weeks

chandra babu naidu no appointment for akhila priya last few weeks

టీ ప్రభుత్వంకు భయపడి..

అఖిల ప్రియ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు ఎవరితో ఏం మాట్లాడలేక పోతున్నాడు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై కేసు ఉంది. ఆ కేసు కాస్త సీరియస్ గా ఉంది. ఇప్పుడు అఖిల ప్రియకు మద్దతుగా ఏం మాట్లాడినా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సైలెంట్‌ గా ఉంటున్నాడు అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నేను నీకు ఏం సాయం చేయలేను ఏమీ అనుకోకమ్మా అంటూ అఖిల ప్రియతో చంద్రబాబు నాయుడు అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp