BJP : చంద్రబాబు నాయుడుని బీజేపీ పిలిచిందా లేక ఆయనే వెళ్లారా..??

BJP  : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీజేపీతో పొత్తు కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అనుకూల మీడియా మరో విధంగా ప్రచారం చేస్తుంది. బీజేపీ అగ్రనేతలే చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి పిలిపించారని, పొత్తుకు బీజేపీ సుముఖంగా ఉందని మీడియా ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ స్పందించలేదు. ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలంటే పొత్తులతోనే ముందుకు వెళ్లాలని టీడీపీ తోపాటు జనసేన పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. తమ రెండు పార్టీలతోపాటు బీజేపీని కూడా కలుపుకుపోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అయితే బీజేపీ నాయకత్వం టీడీపీ ఉన్న కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది.

టీడీపీ, బీజేపీ మధ్య వారధి వేసేందుకు పలుమార్లు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో రాయబారం నడిపారు. అయితే అవి వర్క్ అవుట్ కాలేదు. బీజేపీతో పార్టీ ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీతో చేతులు కలిపితే ఎందుకైనా పనికి వస్తుంది అన్నది చంద్రబాబు ఆలోచన గా ఉందని అంటున్నారు. బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే అవసరమైతే లోక్ సభ స్థానాలు బీజేపీకి వీలైనన్ని ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని తెలుస్తుంది. ఈ ఆఫర్ ను నేరుగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కి స్వయంగా తెలియజేయాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని సమాచారం. టీడీపీ పొత్తు కోసం ఎక్కువగా వెంపర్లాడుతుంది కాబట్టి పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడగడానికి ఇదే సమయం అని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో 400 స్థానాలకు దక్కకుండా గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో అన్నారు. అయితే ఆ 400 స్థానాలు బీజేపీ అభ్యర్థులు కారని మిత్రపక్షాలతో కలుపుకొని అన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 400 మార్క్ టార్గెట్ ను పెట్టుకుంటే ఓటు బ్యాంకు లేని ఏపీ వీలైన స్థానాలు ఎక్కువగా బేరం ఆడి తీసుకుంటే ఎంతో కొంత లబ్ది చేకూరుతుందని బీజేపీ నేతల అభిప్రాయం ఉందని అంటున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే చంద్రబాబు సీట్ల విషయంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వైసీపీ పార్టీలో టికెట్లు రానివారు ఒకరిద్దరిని బీజేపీ తరపున పోటీ చేయించాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన.

Recent Posts

Goji Berries : గోజి బెర్రీలు ఎప్పుడైనా తిన్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?

Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…

46 minutes ago

Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..?

Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…

2 hours ago

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

11 hours ago

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊత‌మిచ్చిన వీడియో

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…

12 hours ago

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…

13 hours ago

Chamala Kiran Kumar Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…

14 hours ago

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

15 hours ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

16 hours ago