BJP : చంద్రబాబు నాయుడుని బీజేపీ పిలిచిందా లేక ఆయనే వెళ్లారా..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP : చంద్రబాబు నాయుడుని బీజేపీ పిలిచిందా లేక ఆయనే వెళ్లారా..??

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  BJP : చంద్రబాబు నాయుడుని బీజేపీ పిలిచిందా లేక ఆయనే వెళ్లారా..??

BJP  : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీజేపీతో పొత్తు కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అనుకూల మీడియా మరో విధంగా ప్రచారం చేస్తుంది. బీజేపీ అగ్రనేతలే చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి పిలిపించారని, పొత్తుకు బీజేపీ సుముఖంగా ఉందని మీడియా ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ స్పందించలేదు. ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలంటే పొత్తులతోనే ముందుకు వెళ్లాలని టీడీపీ తోపాటు జనసేన పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. తమ రెండు పార్టీలతోపాటు బీజేపీని కూడా కలుపుకుపోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అయితే బీజేపీ నాయకత్వం టీడీపీ ఉన్న కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది.

టీడీపీ, బీజేపీ మధ్య వారధి వేసేందుకు పలుమార్లు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో రాయబారం నడిపారు. అయితే అవి వర్క్ అవుట్ కాలేదు. బీజేపీతో పార్టీ ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీతో చేతులు కలిపితే ఎందుకైనా పనికి వస్తుంది అన్నది చంద్రబాబు ఆలోచన గా ఉందని అంటున్నారు. బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే అవసరమైతే లోక్ సభ స్థానాలు బీజేపీకి వీలైనన్ని ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని తెలుస్తుంది. ఈ ఆఫర్ ను నేరుగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కి స్వయంగా తెలియజేయాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని సమాచారం. టీడీపీ పొత్తు కోసం ఎక్కువగా వెంపర్లాడుతుంది కాబట్టి పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడగడానికి ఇదే సమయం అని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో 400 స్థానాలకు దక్కకుండా గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో అన్నారు. అయితే ఆ 400 స్థానాలు బీజేపీ అభ్యర్థులు కారని మిత్రపక్షాలతో కలుపుకొని అన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 400 మార్క్ టార్గెట్ ను పెట్టుకుంటే ఓటు బ్యాంకు లేని ఏపీ వీలైన స్థానాలు ఎక్కువగా బేరం ఆడి తీసుకుంటే ఎంతో కొంత లబ్ది చేకూరుతుందని బీజేపీ నేతల అభిప్రాయం ఉందని అంటున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే చంద్రబాబు సీట్ల విషయంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వైసీపీ పార్టీలో టికెట్లు రానివారు ఒకరిద్దరిని బీజేపీ తరపున పోటీ చేయించాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది