AP Govt : ఏపీకి ఇక మంచిరోజులు రాబోతున్నాయి.. కేంద్రం నుంచి సహకారం రాబోతోంది.. అంతా వైఎస్ జగన్ వల్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Govt : ఏపీకి ఇక మంచిరోజులు రాబోతున్నాయి.. కేంద్రం నుంచి సహకారం రాబోతోంది.. అంతా వైఎస్ జగన్ వల్లే

AP Govt : ఏపీకి ఇక మంచిరోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును.. వచ్చే నెల అంటే మార్చి 10 తర్వాత ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. కేంద్రం నుంచి మరింత సహకారం అందబోతోంది. నిజానికి.. 2019 నుంచి అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీకి కేంద్రం నుంచి సరైన సహకారం అందలేదు. ఒక్క విషయంలో కాదు.. చాలా విషయంలో కేంద్రం మొండి చేయి చూపింది. దీంతో సీఎం వైఎస్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 February 2022,2:00 pm

AP Govt : ఏపీకి ఇక మంచిరోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును.. వచ్చే నెల అంటే మార్చి 10 తర్వాత ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. కేంద్రం నుంచి మరింత సహకారం అందబోతోంది.

నిజానికి.. 2019 నుంచి అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీకి కేంద్రం నుంచి సరైన సహకారం అందలేదు. ఒక్క విషయంలో కాదు.. చాలా విషయంలో కేంద్రం మొండి చేయి చూపింది. దీంతో సీఎం వైఎస్ జగన్.. అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. కానీ.. కేంద్రం మాత్రం ఏనాడూ పట్టించుకోలేదు.

AP Govt : ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి

కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బీజేపీయేతర కూటమి  కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇది సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్ద దెబ్బ పడేలా చేస్తుందని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే.. కనీసం ఏపీ సపోర్ట్ అయినా బీజేపీకి ఉండాలని.. ఏపీ సీఎం జగన్ ను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే.. ప్రస్తుతం ఏపీలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

సీఎం జగన్ ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. త్వరలోనే సీఎం జగన్ ఇదివరకు కేంద్రానికి విన్నవించిన పలు అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది