CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో మూడు రాజధానులంటూ కాలయాపన చేసిన జగన్, ఇప్పుడు మళ్లీ అమరావతిపై మాట్లాడుతుండటం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. “సీఎం ఎక్కడుంటే అదే రాజధాని” అన్న జగన్ గత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆయన బెంగళూరులోనో, ఇడుపులపాయలోనో ఉంటే అవే రాజధానులవుతాయా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంటే, ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!
వైసీపీని ఒక ‘ఫేక్ పార్టీ’గా అభివర్ణించిన చంద్రబాబు, ఆ పార్టీ హయాంలో జరిగిన భూ రికార్డుల అక్రమాలను ఎండగట్టారు. రూ.700 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు చేసి సర్వే రాళ్లపై, భూముల పాసు పుస్తకాలపై తన బొమ్మలు వేయించుకున్న జగన్.. ఇప్పుడు అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ‘క్రెడిట్ చోరీ’ అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మన తాత ముత్తాతల ఆస్తుల రికార్డులపై వ్యక్తిగత ఫొటోలు వేసుకోవడం అహంకారానికి పరాకాష్ట అని, అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మళ్లీ అధికారిక ‘రాజముద్ర’ను పునరుద్ధరించామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తే ఎక్కడున్నా లాక్కొచ్చి శిక్షిస్తామని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రధాన పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలన్నీ టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి వల్లే సాధ్యమయ్యాయని చంద్రబాబు వివరించారు. కియా మోటార్స్, గూగుల్ కార్యాలయాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మరియు తెలంగాణలోని సైబరాబాద్ వంటివన్నీ తన హయాంలోనే రూపుదిద్దుకున్నాయని గుర్తు చేశారు. కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ చూస్తోందని, గత ఐదేళ్లలో కేవలం మాఫియాలకే పెద్దపీట వేశారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకున్న వారే ఇప్పుడు క్రెడిట్ కోసం గింజుకుంటున్నారని, ప్రజలంతా వాస్తవాలను గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.