YS Jagan Mohan Reddy : పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి గట్టి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి గట్టి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!
YS Jagan Mohan Reddy : మరో మూడు, నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక అధికార పార్టీపై గెలిచేందుకు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వారికి గట్టిగా ఇచ్చిపడేసారు. ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ బర్రెలక్క ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని అన్నారు. చంద్రబాబుకు పేదల ప్రాణాలు అంటే లెక్కలేదు అని అన్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య గత ప్రభుత్వంలో కూడా ఉంది అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైయస్సార్ కిడ్నీస్ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైయస్సార్ సుజల ధార ప్రాజెక్టును సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. తన సొంత నియోజకవర్గ కుప్పంలో నీరు అందించలేదని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర పై ఏం ప్రేమ ఉందంటూ మండిపడ్డారు. విశాఖను రాజధాని చేద్దామంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్న దౌర్భాగ్యులు అని ఆయన అన్నారు.
ఇక తాజాగా చంద్రబాబు నాయుడు జగన్ పాలన పై విమర్శలు చేశారు. తుఫాను కారణంగా పంటలన్ని నాశనం అయ్యాయి. రైతులను పరామర్శించడానికి వీళ్ళకి తీరిక కూడా లేదు. రెడ్ కార్పెట్ పై వెళ్లి పరామర్శించారు. ఆయన పుట్టగానే రెడ్ కార్పెట్ లో పుట్టారు. ఆయన ఎక్కడ కూడా కిందకి దిగలేడు. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు. ఆలుగడ్డ కి ఉల్లిగడ్డ కి తేడా తెలియదు. వ్యవసాయాన్ని ఇంత చిన్నచూపు చూడడం దౌర్భాగ్యం. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. బాధ్యత లేని ప్రభుత్వం వలన రైతాంగం చాలా నష్టపోతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఏపీకి దౌర్భాగ్యం అని చంద్రబాబు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు.