Big Breaking : టీడీపీ అభిమానులకు గుడ్ న్యూస్.. చంద్రబాబుకు బెయిల్.. సంతోషంలో నారా లోకేష్, భువనేశ్వరి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Breaking :  టీడీపీ అభిమానులకు గుడ్ న్యూస్.. చంద్రబాబుకు బెయిల్.. సంతోషంలో నారా లోకేష్, భువనేశ్వరి

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2023,2:37 pm

ప్రధానాంశాలు:

  •  టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట

  •  కోర్టుకు సరెండర్ కావాల్సిన అవసరం లేదు

  •  చంద్రబాబు లాయర్ల వాదనలు విన్న కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు

Chandrababu : హమ్మయ్య.. టీడీపీ అభిమానుకు గుడ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన మధ్యంతర బెయిల్ మీద ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చారు. మరో మూడు నాలుగు రోజుల్లో చంద్రబాబు కోర్టుకు సరెండర్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవంబర్ 24న తిరిగి కోర్టుకు చంద్రబాబు సరెండర్ కావాల్సిన అవసరం లేదు.

చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలియగానే.. నారా కుటుంబ సభ్యులు, టీడీపీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. నారా లోకేష్, నారా భువనేశ్వరి సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు బెయిల్ విషయమై హైకోర్టు ఇప్పటికే ఇరు పక్షాల నుంచి వాదనలు విన్నది. దానిపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మాత్రమే కాదు. పలు ఇతర కేసులు కూడా సీఐడీ నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ స్కామ్ లో చంద్రబాబు పేర్లను ఏపీ హైకోర్టు నమోదు చేసింది. వాటిపై కూడా చంద్రబాబు ముందే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా బెయిల్ మంజూరు కాలేదు. అలాగే.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులోనూ చంద్రబాబు చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా దక్కలేదు.

తాజాగా చంద్రబాబు తరుపు లాయర్ల వాదనలు విన్న కోర్టు.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే.. ఇదంతా కావాలని కక్షసాధింపు చర్యల్లో భాగమని, ఇదంతా ఏపీ సీఎం వైఎస్ జగన్ కావాలని చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తూ అందులో నిందితుడిగా చంద్రబాబును చేర్చుతూ ఆయన్ను అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉంచిన విషయం తెలిసిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది