Chandrababu Naidu : నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేయను.. లోకేష్ మాటలకి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేయను.. లోకేష్ మాటలకి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు..!
Chandrababu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి వైయస్ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలే కాదు నేను బాధితుడినే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. అందరం బాధితులమే అని చంద్రబాబు నాయుడు వాపోయారు. విజయవాడలో విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కే. రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైయస్ జగన్ పై ధ్వజమెత్తారు. దేశంలో ఇదే తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం మొదటిసారిగా చూస్తున్న. నా మనసులోనే కాదు ఐదు కోట్ల ప్రజల మనసులో ఉంది. విధ్వంసం పుస్తకంలో రాశారు. సైకో పాలనలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసం అయింది.
ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారని , దీన్ని బట్టి ఆయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 30వేల ఎకరాలు 33 వేల మంది రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చారు. రైతులు అంత పెద్ద త్యాగం చేసినప్పుడు రాష్ట్రం బాగుపడాలి కానీ అది జరగలేదు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికేది. అమరావతి నిర్మించి ఉంటే రెండు లక్షల కోట్లు వచ్చేవి. రాష్ట్ర ప్రజల ఆస్తినిధ్యం చేశారు. నాలుగవ రాజధాని హైదరాబాద్ కావాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే అలా మాట్లాడతారా నాలుగవ రాజధాని కోసం పోరాడుదాం అంటే సిగ్గుపడాలి అని అన్నారు. ప్రజా వేదిక కూల్చి అలా వదిలేశారు నేను చూసి బాధపడాలని నేను అడిగానని కూల్చి విధ్వంసం చేశారు. వచ్చే పరిశ్రమలను తోసేసిన సీఎంని రాజకీయ చరిత్రలో మొదటిసారి చూసా.
అమర్ రాజా ఇండస్ట్రీని వేధిస్తే అది తెలంగాణకు పోయింది. గల్లా జయదేవ్ తన వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ కలిసి పోరాడుతాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. తన సొంత చెల్లిని, తల్లిని సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటే ఏం చెప్తాం. అలిపిరి పైన బ్లాస్ట్ చేసిన ప్రాణానికి భయపడలేదు. అసెంబ్లీలో నా పైన వేస్తున్న దానికి కన్నీరు పెట్టుకున్న. ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. మద్యం ఇసుక మైనింగ్ తో పాటు ఏది దొరుకుతది. ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లాలంటే హెలికాప్టర్ దిగేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. పరుచూరులో నాకు అనుమతినివ్వలేదు. ఎవరికైనా సమస్య వస్తే ప్రభుత్వం వద్దకు వెళ్దాం. ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ప్రజలను ప్రశ్నించారు.