Chandrababu Naidu : తక్కువ సీట్లు ఇచ్చానని బాధపడకు పవన్ కళ్యాణ్.. 2024 లో సీఎం నువ్వే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu Naidu : తక్కువ సీట్లు ఇచ్చానని బాధపడకు పవన్ కళ్యాణ్.. 2024 లో సీఎం నువ్వే..!

Chandrababu Naidu : ఏపీ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఇక టీడీపీకి 94 సీట్లు జనసేనకి 24 సీట్లు ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థులను రెండు మూడు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు టీడీపీ, జనసేన ఉమ్మడి మీడియా […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : తక్కువ సీట్లు ఇచ్చానని బాధపడకు పవన్ కళ్యాణ్.. 2024 లో సీఎం నువ్వే..!

Chandrababu Naidu : ఏపీ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఇక టీడీపీకి 94 సీట్లు జనసేనకి 24 సీట్లు ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థులను రెండు మూడు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు టీడీపీ, జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో పొత్తు పెట్టుకున్నామని, ఐదు కోట్ల ప్రజల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని, రాష్ట్ర చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అనిమ రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. బ్రాండ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను పూర్తిగా నాశనం చేశారు. వైయస్ జగన్ పాలనలో సామాన్యులు నేతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారు. పొత్తు కుదిరిన రోజే మా విజయం ఖరారైంది. ఆ రోజే వైసీపీ కాడి వదిలేసింది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

నా రాజకీయ జీవితంలో అభ్యర్థుల లిస్ట్ కోసం ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో కోటి మందిని అభిప్రాయం అడిగాం. అభ్యర్థులుగా నిలబెడుతున్న తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేసాం. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాము. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. అదే వైసీపీ అభ్యర్థులను చూస్తే ఎర్రచందనం స్మగ్లర్లను వారిని పోటీకి పెట్టారు. మేం మాత్రం ప్రజలకు జవాబు దారితనంగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేసాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇరు పార్టీల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను బరిలో దింపుతున్నామని ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామని అన్నారు. అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 60,70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో పది స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. 24 అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలు జనసేన పోటీ చేస్తుందన్నారు. బీజేపితో కలిసి ముందుకు వెళ్లాలని ఉద్దేశంతో కొన్ని స్థానాలను త్యాగం చేసినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొత్తులో భాగంగా త్యాగాలకు పాల్పడిన వారికి టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది