Hari Hara Veera Mallu Movie : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంకి శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు.. ఫ్యాన్స్ ఖుష్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hari Hara Veera Mallu Movie : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంకి శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు.. ఫ్యాన్స్ ఖుష్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2025,11:40 am

ప్రధానాంశాలు:

  •  Hari Hara Veera Mallu Movie : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంకి శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు.. ఫ్యాన్స్ ఖుష్..!

Hari Hara Veera Mallu Movie : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ నేడు ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు.

Hari Hara Veera Mallu Movie హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంకి శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు ఫ్యాన్స్ ఖుష్

Hari Hara Veera Mallu Movie : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంకి శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు.. ఫ్యాన్స్ ఖుష్..!

Hari Hara Veera Mallu Movie : చంద్ర‌బాబు విషెస్..

ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, సమయాన్ని కేటాయించి నటించిన పవన్ కళ్యాణ్‌కి అభినందనలు” అంటూ చంద్రబాబు కొనియాడారు. సినిమా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ప్రేక్షకుల్లో ధైర్యం, నైతికతకు ప్రోత్సాహం కలిగించాలని ఆకాంక్షించారు.‘ధర్మం కోసం యుద్ధం ప్రారంభం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో కూడిన సినిమా పోస్టర్‌ను చంద్రబాబు తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ, “తెలుగు సినిమా గర్వించదగిన ప్రాజెక్ట్” అంటూ పేర్కొన్నారు.

ఈ శుభాకాంక్షలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు “ధర్మయుద్ధానికి ధర్మ నాయకుడి ఆశీర్వాదం” అంటూ స్పందిస్తున్నారు. చిత్రంకి స్పందించి గ‌త రాత్రి ప్రీమియ‌ర్ షోస్ ప‌డ‌గా, కొంద‌రు సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్‌ సీన్లు ఆకట్టుకున్నాయని అంటున్నారు. గ్రాఫిక్స్‌ కూడా అదిరిపోయినట్లు చెబుతున్నారు. చారిత్రక కథను డైరెక్టర్లిద్దరూ బాగా చూపించారని అంటున్నారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని.. కీరవాణి మ్యూజిక్‌ కూడా ఈ చిత్రానికి హైలెట్‌ అని చెబుతున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది