Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండ‌గా, అక్కడి మహాత్మా మందిర్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు.ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండ‌గా, అక్కడి మహాత్మా మందిర్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు.ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై, ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తిసామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు.

Chandrababu ఇంత మొదం ఎందుకు?

భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం… శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరం అని పేర్కొన్నారు. ఈ కోణంలోనే, 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు.రీ-ఇన్వెస్ట్‌ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్‌ శబ్ధం ఎక్కువ ఉండటంతో దగ్గరకు వచ్చిన మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకన్లు పాటు చంద్రబాబుకు మోదీ షేక్‌ హ్యాండ్‌ ఇస్తూనే ఉన్నారు.

Chandrababu మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా

Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

మోడీతో కలసి ఉండడం వేదిక పంచుకోవడం ఇవన్నీ బాబుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. చిన్న చిన్న వాటికి బాబు ఇలా ఉప్పొంగిపోతే ఎలా? ఏపీ వరదలతో భారీ వానలతో అన్ని రకాలుగా నష్టపోయింది కేంద్రం ఇచ్చిన తక్షణ సాయం ఏమిటి అన్నది అందరి మాటగా ఉంది. ఏపీకి మోడీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి ఏపీని ఆదుకుంటే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల వరద నష్టం అని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్ర బృందం కూడా తన నివేదికను తయారు చేసింది. వీటి మీద కేంద్రం తక్షణం స్పందించి ఏమైనా సాయం చేస్తే మోడీ చేసిన సాయానికి ఏపీ ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు క‌దా అని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది