Chandrababu : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో చంద్రబాబు సంచలన స్పీచ్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో చంద్రబాబు సంచలన స్పీచ్ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :21 May 2023,1:30 pm

Chandrababu : హైదరాబాదు నగరంలో శనివారం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ రాజకీయ నేతలు సినిమా సెలబ్రిటీలు కొర్ర హీరోలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచల స్పీచ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆయన కుటుంబానికి సొంతం కాదని తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన జన్మని తెలుగు జాతికి అంకితం చేసిన మహానుభావుడని చంద్రబాబు కీర్తించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని ప్రపంచవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు.

ప్రపంచ అగ్ర దేశం అమెరికాలో దాదాపు 50 ప్రాంతాలలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. అయినా పల్లెల్లో పూర్తి కష్టపడి ఎరిగిన నాయకుడు. ఎన్టీఆర్ నిస్వార్ధ మరియు నీతిపరుడు అయిన నేత అని చంద్రబాబు అభివర్ణించారు. రాయలసీమలో కరువు వచ్చినప్పుడు దివిసీమ ఉప్పెన వస్తే జోలె పట్టి ప్రజలకు సహాయం చేసిన నేత అని పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికాలో ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28వ తారీఖున తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించారని స్పష్టం చేశారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన గుర్తింపుకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని ఆయన మహా శక్తి అని కొనియాడారు.

chandrababu sensational speech at ntr centenary celebrations

chandrababu-sensational-speech-at-ntr-centenary-celebrations

ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏదైనా కార్యక్రమం తలపెడితే కచ్చితంగా విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిగా రాముడిగా ఇతర పాత్రలను కూడా భవిష్యత్తులో మరెవ్వరు చేయలేనంత ప్రభావంతంగా ఎన్టీఆర్ చేయడం జరిగిందని తెలిపారు. ఆయన మానవత్వం కూడా మూర్తి భావించిన వ్యక్తని పేర్కొన్నారు. తనని 40 సంవత్సరాలు పాటు ఆదరించిన ప్రజలకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఎన్టీఆర్ ఆద్యుడు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది