Chandrababu : సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతుందా.. జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి ?
ప్రధానాంశాలు:
Chandrababu : సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతుందా.. జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి ?
Chandrababu : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా.. ఆరు ప్రత్యేక హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు విస్తృత ప్రచారం చేశారు. యువత ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. ఈ ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా భర్తీచేయలేదు. సూపర్‌సిక్స్‌లో భాగంగా యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేస్తామని ప్రకటించారు. దీంతో యువత భారీ ఆశలు పెంచుకుంది
Chandrababu చంద్రబాబుకి కష్టాలు..
అయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి కూడా డిమాండ్లు ప్రారంభమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం మూడు మాసాలు కూడా కాలేదని సరిపెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. .. స్కూళ్లలో ఫీజులు కట్టాల్సి రావడం, పండుగలు రావడం, నిత్యావసర ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ప్రజలు విన్నవిస్తున్నారు.అదేసమయంలో ప్రతి నెల రూ.1500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రజలు కోరుకుంటు న్నారు.
మధ్యతరగతి ప్రజలు ఉచిత హామీలకు అనుకూలంగా కూటమికి ఓటేసి గెలిపించలేదు. కేవలం అభివృద్ది మంత్రానికే వారు పట్టం కట్టారు.అలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలు కడుతున్న పన్నులు, లేదా చేస్తున్న అప్పులను ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తే.. అది మధ్యతరగతిలో తీవ్ర వ్యతిరేకతను పెంచేయనుంది. ఇదే ఎఫెక్ట్ వైసీపీపై పడడం మనం చూశాం.. వైసీపీ పెద్ద ఎత్తున చేసిన సంక్షేమంపై మధ్యతరగతి ఆందోళ న వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా అదే పనిచేస్తే.. ఇబ్బంది అని చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకి సామాన్యుల నుంచి నిరంతరం సెగ పెరుగుతూ ఉండగా ఆయన అమలు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది