Jr NTR : చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్‌ని కాకుండా చ‌ర‌ణ్‌కి ఆహ్వాన‌మా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్‌ని కాకుండా చ‌ర‌ణ్‌కి ఆహ్వాన‌మా..!

Jr NTR : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించ‌డం మ‌నం చూశాం. అధికార పార్టీ వైఎస్సారీసీపిని చిత్తు చేస్తూ ఏకంగా 164 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తద్వారా ఏపీలో మరోసారి చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం (జూన్ 12వ తేదీ) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయ‌బోతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr NTR : చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్‌ని కాకుండా చ‌ర‌ణ్‌కి ఆహ్వాన‌మా..!

Jr NTR : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించ‌డం మ‌నం చూశాం. అధికార పార్టీ వైఎస్సారీసీపిని చిత్తు చేస్తూ ఏకంగా 164 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తద్వారా ఏపీలో మరోసారి చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం (జూన్ 12వ తేదీ) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయ‌బోతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాలు స్థలంలో బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది.

చంద్రబాబుతో పాటు ప‌లువురు క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఏపీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన జనసేన ఎమ్మెల్యేలు కూడా క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మ‌రి ఎన్టీఆర్ సంగ‌తేంటి అని అంద‌రిలో అనేక అనుమానాలు ఉండ‌గా, దీనిపై నందూమూరి ఫ్యామిలీకి చెందిన చైత‌న్య కృష్ణ స్పందించారు.

Jr NTR చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్‌ని కాకుండా చ‌ర‌ణ్‌కి ఆహ్వాన‌మా

Jr NTR : చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఎన్టీఆర్‌ని కాకుండా చ‌ర‌ణ్‌కి ఆహ్వాన‌మా..!

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే.. ఈమధ్య ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం మానేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో నాకు తెలియదు’ అని అన్నారు నందమూరి చైతన్య కృష్ణ. అయితే ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన త‌న మావ‌య్య‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ ‘ఎక్స్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. “ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్‌కు నా శుభాకాంక్షలు” అంటూ తార‌క్ ట్వీట్ చేశారు. దీనిపై చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ‘థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ’ అంటూ రిప్లై ఇచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది