Chiranjeevi : వైఎస్‌ జగన్ చేసిన పనికి చిరంజీవి అభినందనలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : వైఎస్‌ జగన్ చేసిన పనికి చిరంజీవి అభినందనలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 March 2021,9:00 pm

Chiranjeevi : ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నేడు నెరవేరాయి. కర్నూలు వాసుల స్వప్పం ఫలించింది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభం అయింది. ఈ ఎయిర్ పోర్ట్ ను సీఎం జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.

నిజానికి.. కర్నూలు ఎయిర్ పోర్ట్ కల ఈనాటిది కాదు. వైఎస్సార్ కాలంలోనే కర్నూలు జిల్లాలో ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ చేపట్టారు. ఆ తర్వాత కేంద్రం కూడా ఎయిర్ పోర్ట్ ను మంజూరు చేయడంతో అక్కడ ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. భూసేకరణ తర్వాత వేరే అనుమతుల్లో జాప్యం జరగడంతో… ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఆలస్యమైంది.

chiranjeevi praises Ys jagan for naming kurnool airport after the uyyalavada narasimha reddy

chiranjeevi praises Ys jagan for naming kurnool airport after the uyyalavada narasimha reddy

కానీ… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక… ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. వెంటనే ఏవియేషన్ అనుమతులను కూడా ప్రభుత్వం తీసుకొని.. యుద్ధప్రాతిపదికన ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణం పూర్తి కావడంతో…. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా ప్రారంభించారు. ఈనెల 28 నుంచి కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి విమనాలు ఎగరనున్నాయి.

కర్నూలు విమనాశ్రయానికి సీఎం జగన్.. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

1847వ సంవత్సరంలోనే సిఫాయిల తిరుగుబాటుకు ముందే.. రైతుల కోసం తన ప్రాణాలను అర్పించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన పేరుతో కర్నూలు ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించడంతో.. సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Chiranjeevi : ఉయ్యాలవాడ పేరు పెట్టినందుకు జగన్ ను అభినందించిన చిరు

సీఎం జగన్ కర్నూలు విమానాశ్రయానికి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం జగన్ ను ఆయన అభినందించారు. భారతదేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. గొప్ప దేశభక్తి కలిగిన ఉయ్యాలవాడకు సరైన గుర్తింపు లభించిందని ఆయన ట్వీట్ చేశారు. గొప్ప వ్యక్తి గురించి ప్రపంచానికి చెప్పడం కోసం వెండి తెర మీద ఆయనలా నటించడం నా అదృష్టం అంటూ చిరంజీవి తన ట్వీట్ లో తెలిపారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది