YS Jagan : సరిగ్గా ఎన్నికల టైం లో సూపర్ ప్లానింగ్ తో దిగిన జగన్ మోహన్ రెడ్డి !
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. సీఎం జగన్ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అయితే.. ఇప్పటికే ఆయన నాలుగేళ్ల పాలన పూర్తయింది. నాలుగేళ్లలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఏపీలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఏపీ. దానికి కారణం.. ఏపీ పథకాలు. అసలు వాలంటీర్ల వ్యవస్థను ఎవరైనా ఇప్పటి వరకు తీసుకొచ్చారా?
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ సీఎం జగన్ కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పెండింగ్ నిధులకు ఆమోదం తెలపడంతో సీఎం జగన్ కు ఆర్థికంగానూ కాస్త వెసులుబాటు వచ్చింది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక అడుగు ముందుకు పడింది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.17 వేల కోట్ల నిధులు వచ్చాయి. దీంతో ప్రాజెక్ట్ పనులు వేగవంతం అయ్యాయి.
YS Jagan : సీఎం జగన్ వల్లనే రూ.17 వేల కోట్ల నిధుల విడుదల
సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి పోలవరం సమీక్షలో ఏపీ ప్రభుత్వం తరుపున ప్రతిపాదనలు సమర్పించడంతో అడహక్ నిధుల కింద రూ.17 వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఓవైపు ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఇలాంటి ప్రకటన రావడం అనేది శుభ తరుణం. ఇదంతా కేవలం సీఎం జగన్ కృషితోనే సాధ్యం అయింది. ఈ పనిని ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు చేయలేకపోయారు. ఇక.. నిధులు విడుదల కావడంతో సీఎం జగన్ పోలవరాన్ని సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్ ను జగన్ పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్ సందర్శన తర్వాత జలవనరుల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.