Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
ప్రధానాంశాలు:
Dwakra Women : ఏపీలో డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
ఏపీలో ‘నమో డ్రోన్ దీదీ’ పథకం..10 లక్షల విలువైన డ్రోన్ కేవలం రూ.2 లక్షలకే
Dwakra Women : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల మహిళలకు శుభవార్త తెలిపింది. వ్యవసాయ రంగంలో మహిళల సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లు అందించనున్నారు. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.10 లక్షలు కాగా, అందులో రూ.8 లక్షలు రాయితీగా అందిస్తారు. మిగిలిన రెండు లక్షలు బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి లేదా వివో ద్వారా రుణంగా పొందే అవకాశం ఉంటుంది.

Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
Dwakra Women : ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్ ..ఎందుకంటే కేంద్ర కీలక పథకం అమలు కాబోతుంది
ఈ ఏడాది మొత్తం 440 మంది మహిళలకు డ్రోన్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొదటిగా 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన లబ్ధిదారుల ఎంపికను జూలై నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎంపికైన మహిళలకు డ్రోన్లను పంపిణీ చేయడంతో పాటు, వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి డీ హెచ్ఏజీఈ-10 రకం డ్రోన్లు కేంద్రం అందిస్తోంది. ఇవి తక్కువ బరువు కలిగి ఉండటంతో రైతుల పొలాల్లో సులభంగా రసాయనాలను పిచికారీ చేయగలవు.
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయంలో సమయం, శ్రమను ఆదా చేయడమే కాకుండా, రసాయనాల వినియోగం 10 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల పంటలపై అధిక నాణ్యతతో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించగా, కేంద్రం ఆశించిన విధంగా పథకం ప్రయోజనాలు మహిళలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు, మహిళలకు లబ్ధి చేకూర్చే ఈ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.