Viral Video : ఎంసెట్ ర్యాంక్ సాధించింది క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు ఏపీలో ఓ యువతి దుస్థితి వీడియో వైరల్..!!
Viral Video : తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా కులపిచ్చి కలిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చాలామంది చెబుతుంటారు. మనుషుల కంటే కులానికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని అంటుంటారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మానవత్వం చాటుకుని మర్యాద ఇవ్వడంలో తెలంగాణ ప్రజలకు మించిన వాళ్ళు ఉండరని చెబుతుంటారు. అంతలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల ప్రభావం ఉంటుందని.. చాలామంది చెప్పుకొస్తారు. అటువంటి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దాదాపు పాతిక వేల మంది ప్రజలు కుల ద్రవపత్రం లేక ఉన్నత చదువులు చదువుకోడానికి నొచ్చుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ లో బయటపడింది. ప్రస్తుత సమాజంలో ఎక్కడ చదువుకోవాలనుకున్న కచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం నుండి లాభాలు అదేవిధంగా.. ఫీజు రియంబర్స్మెంట్ అందుతాయి. అంతేకాదు ఈ సర్టిఫికెట్ ఆధారంగానే కొన్ని పథకాలు కూడా లభిస్తాయి. కానీ ఇచ్చాపురంలో ఉన్న ఈ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందటం. బెంతోరియా అనే కులం కలిగిన ఈ ప్రజలకి ప్రభుత్వం నుండి కుల దృవపత్రాలు రావటం లేదట. ఈ పరిణామంతో బెంతోరియా కులం కలిగిన ఈ ప్రజలు ఉన్నత చదువులు చదువుకోలేక ఉద్యోగాలు సంపాదించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంతోరియాకి చెందిన ఇప్పటి యువతీతోపాటు తల్లిదండ్రుల సైతం ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుంది తమ పిల్లల భవిష్యత్తుని ఎప్పుడు కాపాడుతుంది అని బెంతోరియా ప్రజలు సదరు వెబ్ మీడియా ఛానల్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే బెంతోరియా కులానికి చెందిన ఓ అమ్మాయి కష్టపడి ఎంసెట్ లో ర్యాంకు సాధిస్తే.. క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని సీటు ఇవ్వలేదట. దీంతో ఆ యువతి ఈ వెబ్ మీడియా ఛానల్ ముందు కన్నీళ్లు పెట్టుకుని బోరుమని ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.