Farmers : రైతులకు గుడ్‌న్యూస్… అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు..!
ప్రధానాంశాలు:
Farmers : రైతులకు గుడ్‌న్యూస్... అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు..!
Farmers : అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే రూ.6 వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.20 వేలు అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

Farmers : రైతులకు గుడ్‌న్యూస్… అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు..!
ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తామని తెలిపారు. ఇటీవల 2024-25 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలో భూమిలేని సాగుదారులకూ రూ.20,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందుస్తుంది.. దీని కోసం బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించారు.
వచ్చే నెలలో సంక్రాంతికి రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. కానీ, ఆర్దికంగా వెసులుబాటు ఎంత వరకు సాధ్యమనే చర్చ మొదలైంది. కానీ, ప్రభుత్వంపై ఇప్పుడు రైతులతో పాటుగా విద్యార్ధుల ఫీ రీయంబర్స్ మెంట్ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అన్నదాత సుఖీభవ అమలు పైన ఆచితూచి వ్యవహరిస్తోంది. సంక్రాంతికి అమలు చేయటమా ?లేక వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేస్తారా అనేది అతి త్వరలోనే స్పష్టత వస్తుంది. farmers AP’s key announcement on Annadata Sukhibhav scheme , AP, Annadata Sukhibhav scheme