Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 10, 2025, 6:00 pm

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20,000ల పెట్టుబడి సాయం ఇవ్వనుంది. రైతుల ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయబడతాయి. విశాఖపట్నం వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు తెలిపిన ప్రకారం, ఈ పథకాన్ని పొందాలంటే రైతులు తక్షణమే eKYC ప్రక్రియను పూర్తి చేయాలి. గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ ప్రక్రియను పర్యవేక్షించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Annadata Sukhibhava : ఏపీ రాష్ట్ర రైతులు ఈ పని చేయకపోతే..మీకు డబ్బులు పడనట్లే..!!

ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు, మధ్యస్థ మరియు పెద్ద రైతులు లబ్ధి పొందవచ్చు. గ్రామ స్థాయిలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతుల సమాచారం తనిఖీ చేయబడుతుంది. మే 20వ తేదీకి ముందు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో రైతుల వివరాలను అప్‌లోడ్ చేసి, eKYC పూర్తిచేయాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు. రైతులు తమ వివరాలను సమయానికి సమర్పించి, సబ్సిడీ సాయం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పథకానికి అనుగుణంగా ఒక రైతు కుటుంబం (భర్త, భార్య, పిల్లలు) ఒక్క యూనిట్‌గా పరిగణించబడుతుంది. ఒకే కుటుంబంలో భూములు ఉన్నవారిలో ఎక్కువ భూమి కలిగి ఉన్న వారి ఖాతాలో నిధులు జమ చేయబడతాయి. మరణించినవారు, ప్రజా ప్రతినిధులు, అధిక పెన్షన్ తీసుకునే వారు, ప్రభుత్వ ఉద్యోగులు (కొందరు మినహాయింపు తో), డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు, ఇతర రాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు కావు. కౌలురైతులకు ప్రత్యేకంగా కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అందువల్ల ప్రతి అర్హ రైతు తప్పకుండా eKYC పూర్తిచేయాలని సూచించడమైనది.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp