Galla Jayadev : ఆ నీచుడి వల్లే రాజకీయాలకి గుడ్ బాయ్ చెప్పిన గల్లా జయదేవ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Galla Jayadev : ఆ నీచుడి వల్లే రాజకీయాలకి గుడ్ బాయ్ చెప్పిన గల్లా జయదేవ్..!

Galla Jayadev : గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీని వీడకూడదని 6 నుంచి 8 నెలల దాకా విశ్వ ప్రయత్నాలు జరిగాయి ఆయనను ఆపేందుకు నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించారు. అయితే గల్లా జయదేవ్ ప్రెస్ మీట్ లో తనకున్న బిజినెస్ లు, వాటిని ఎలా డీల్ చేయాలి, వాటి వల్లనే రాజకీయాలకు తప్పుకుంటున్నాను అని, పది సంవత్సరాలుగా రాజకీయంగా ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు చెబుతూ గల్లా జయదేవ్ రాజకీయాలనుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ చంద్రబాబు […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Galla Jayadev : ఆ నీచుడి వల్లే రాజకీయాలకి గుడ్ బాయ్ చెప్పిన గల్లా జయదేవ్..!

Galla Jayadev : గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీని వీడకూడదని 6 నుంచి 8 నెలల దాకా విశ్వ ప్రయత్నాలు జరిగాయి ఆయనను ఆపేందుకు నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించారు. అయితే గల్లా జయదేవ్ ప్రెస్ మీట్ లో తనకున్న బిజినెస్ లు, వాటిని ఎలా డీల్ చేయాలి, వాటి వల్లనే రాజకీయాలకు తప్పుకుంటున్నాను అని, పది సంవత్సరాలుగా రాజకీయంగా ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు చెబుతూ గల్లా జయదేవ్ రాజకీయాలనుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడుకి గల్లా జయదేవ్ లాంటి వాళ్లు పార్టీ విడిపోవడం ఇష్టం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన గుంటూరులో గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ మూడు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంది.

గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తను ఎంపీగా చేస్తే ఉద్యోగాలు ఇస్తాడని ప్రజలు నమ్ముకున్నారు. ఆ విధంగానే అతడిని గెలిపించారు. అలాంటి సమయంలో గల్లా జయదేవ్ పార్టీని విడిచిపెట్టి పోతే టీడీపీ కి దెబ్బ పడుతుంది. అందుకే గల్లా జయదేవ్ ని ఆపడానికి చంద్రబాబునాయుడు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆయన వ్యక్తిగతంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించేసారు. గత పదేళ్లలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను, రాజకీయంగా ఆయన పై కక్ష సాధింపులు జరిగాయని, తన అమర రాజ్ కంపెనీ ని ఇంకా డెవలప్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనూ రాజకీయాలను వదిలి పూర్తి దృష్టి కంపెనీపై పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ తీవ్ర అగ్రహ వ్యక్తం చేస్తుంది.

టీడీపీ తరపు అభ్యర్థులను వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వలన గల్లా జయదేవ్ పార్టీని వీడిస్తున్నట్లుగా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పారిశ్రామికవేత్తలను వైయస్ జగన్మోహన్ రెడ్డి భయపెట్టడం వలన ఏపీని వీడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలను దెబ్బతీసినట్లు చరిత్ర ఉంది. కానీ ఆయనకి ఐటీ పరంగా పాజిటివిటీ ఉంది. అయితే ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ని అనాల్సింది. ఇద్దరినీ ఖండించాలి ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు దానిని ఖండిస్తే సమాజాన్ని స్ట్రాంగ్ చేయగలుగుతాం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది