Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో పడలేదా.. కారణం ఏంటంటే..!
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచిత వంట గ్యాస్ సిలిండర్, స్టౌవ్ వంటివి అందిస్తున్న క్రమంలో మారుమూల గ్రామాల ప్రజలు సైతం సిలిండర్ ఉపయోగిస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దీపం’ పథకం కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ డబ్బులు విడుదల చేస్తోంది. కాని కొంతమంది లబ్ధిదారులకు ఈ డబ్బులు సకాలంలో జమ కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
Gas Cylinder Subsidy : టెన్షన్ అక్కర్లేదు..
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడానికి సాంకేతిక లోపాలు ప్రధాన కారణం. ముఖ్యంగా రెండో విడత సిలిండర్లకు సంబంధించిన రాయితీ డబ్బులు విడుదల చేయడంలో ఇవి తలెత్తాయి. మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోవడం లేదా KYC ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కూడా డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతుంది.

Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో పడలేదా.. కారణం ఏంటంటే..!
తొలి విడతలో డబ్బులు పొందిన వారందరికీ రెండో విడత రాయితీ డబ్బులు తప్పకుండా అందుతాయి. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిధుల విడుదల ఆలస్యమైందని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ముందు కేవైసీ ప్రక్రియ వెంటనే పూర్తి చేసుకుంటే మీ ఖాతాలో గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. సాంకేతిక సమస్యలు పరిష్కారమై, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు అందుతాయని అధికారులు చెబుతున్నారు