Chandra Babu | ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ .. ఇళ్ల అనుమతుల ఫీజు కేవలం రూ.1!
Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదలు, మధ్య తరగతివారి భద్రత, భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయం పేదవారికి గుడ్ న్యూస్ లాంటి విషయం.పురపాలక, నగర పాలక సంస్థలు, నగర పంచాయితీల పరిధిలో 50 చదరపు గజాల లోపు భూమిపై నిర్మించే జీ+1 భవనాలకు ఇప్పుడు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అనుమతి ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు పురపాలక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
#image_title
ఎవరికిది వర్తిస్తుంది?
పేద, మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే.50 చదరపు గజాల లోపు ఇంటి నిర్మాణాలకి, గరిష్ఠంగా గ్రౌండ్ ప్లస్ వన్ (G+1) భవనాల వరకూ వర్తిస్తుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో ప్లాన్ డ్రాయింగ్ అప్లోడ్ చేయాలి. ఆ సమయంలో ఫీజుగా ఒక్క రూపాయి చెల్లించాలి. దుకాణాలు, కమర్షియల్ బిల్డింగ్‌లకు సాధారణ ఫీజులు మిగిలే విధంగా ఉంటాయి.
60 గజాల భూమిని కుదించి 50గా చూపించినా, రూపాయి ఫీజు వర్తించదు.సర్కారు భూములు లేదా వివాదాస్పద స్థలాల్లో ఇల్లు కట్టాలంటే అనుమతులు రద్దు చేయడం, చట్టపరమైన చర్యలు తప్పవు.ప్రస్తుతం రాష్ట్రంలో ఇళ్ల అనుమతుల ద్వారా సంవత్సరానికి రూ.1500 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో పేదవారు నిర్మించే 25-30% ఇళ్ల కోసం సుమారు రూ.3,000-4,000 చొప్పున ఫీజులు వసూలవుతున్నాయి. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఏటా రూ.6 కోట్లు వరకు సేవ్ అవుతుందని అంచనా.