Pensioners : పెన్షనర్స్ కు శుభవార్త.. ఒకరోజు ముందే పెన్షన్ డబ్బుల పంపిణీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pensioners : పెన్షనర్స్ కు శుభవార్త.. ఒకరోజు ముందే పెన్షన్ డబ్బుల పంపిణీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pensioners : పెన్షనర్స్ కు శుభవార్త.. ఒకరోజు ముందే పెన్షన్ డబ్బుల పంపిణీ..!

Pensioners : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి ఆయన ఆధ్వర్యంలో నడిపిస్తున్న ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని అనరు పెన్షనర్లకు మంచి శుభవార్త వచ్చింది. రాబోయే నెల అనగా సెప్టెంబరు నెలకు సంబంధించిన పెన్షన్స్ ను పంపిణీకి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందరు ఇచ్చే దానికన్నా పింఛనుదారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందేలా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షనర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తూ అందులో భాగంగా ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయలు పింఛన్‌ను అందిస్తున్నారు.

Pensioners రోజు ముందే పెన్షన్..

ఐతే 1వ తారీఖు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం 1 ఆదివారం రావడం వల్ల సెప్టెంబర్ నెల పెన్షన్ ని ఒకరోజు ముందే అంటే శనివారం రోజే ఇచ్చేలా నిర్ణయించారు. ఆగష్టు 31 న రాబోయే నెల పెన్షన్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఐతే దీని కోసం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐతే కొన్ని చోట్ల మాత్రం సెప్టెంబర్ 2న పెన్షన్ ను పొందుతారు. బాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణమయ్మ్ వల్ల పెన్షనర్స్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు.

Pensioners పెన్షనర్స్ కు శుభవార్త ఒకరోజు ముందే పెన్షన్ డబ్బుల పంపిణీ

Pensioners : పెన్షనర్స్ కు శుభవార్త.. ఒకరోజు ముందే పెన్షన్ డబ్బుల పంపిణీ..!

నిధులు ఆలస్యం చేసిన ప్రభుత్వాల కన్నా ఇలా రోజు ముందు ఇచ్చి అండగా నిలబడటం గొప్ప విషయమని స్పందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు నెల పెన్షన్ రావడంతో సంతృప్తి చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగుల చేతనే ప్రస్తుతానికి పెన్షన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెశిషన్ ఇంకా తీసుకోలేదు. దాని గురించి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది