Pensioners : పెన్షనర్స్ కు లైఫ్ సర్టిఫికెట్.. ప్రభుత్వ పెన్షనర్లకు అప్డేట్.. నవంబర్ 30లోపు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోతుంది..!
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పెన్షనర్స్ అంతా కూడా తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30, 2024 లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గడువులోపు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ చెల్లింపులు ఆగిపోతాయి. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తీసుకున్న వారితో పాటుగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది. […]
ప్రధానాంశాలు:
Pensioners : పెన్షనర్స్ కు లైఫ్ సర్టిఫికెట్.. ప్రభుత్వ పెన్షనర్లకు అప్డేట్.. నవంబర్ 30లోపు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోతుంది..!
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పెన్షనర్స్ అంతా కూడా తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30, 2024 లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గడువులోపు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ చెల్లింపులు ఆగిపోతాయి. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తీసుకున్న వారితో పాటుగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది. పెన్షనర్స్ తమ జీవిత ధృవీకరణ పత్రాన్న్ని ఎలా ఇవ్వాలో సమాచారం కింద చూడండి.
Pensioners జీవన్ ప్రమాణ్ పత్ర..
పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్.. దీన్ని జీవన్ ప్రమాణ్ పత్ర అని కూడా అంటారు. దీని వల్ల పెన్షనర్ స్థితి ధృవీకరించడమే కాకుండా మరియు వారు సజీవంగా ఉన్నారని ధృవీకరించే డిజిటల్ పత్రంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు పెన్షన్ పంపిణీని చేసేందుకు ఏటా ఈ సర్టిఫికేట్ అవసరం. ఈ వ్యవస్థ వల్ల పింఛన్లు ఖచ్చితంగా పంపిణీ చేయబడిందని చూపించడమే కాకుండా ప్రభుత్వ నిధుల సమగ్రతను కాపాడేందుకు సహకరిస్తుంది.
పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. 60 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న పెన్షనర్లు ఇది సమర్పించాలి. ఎలాంటి పెండింగ్ లేని పెన్షన్ చ్ల్లింపుల కోసం ఈ గడువు లోగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ తో ఇవ్వాల్సిన పత్రాలు.. ఆధార్, ఉమంగ్ యాప్ ద్వారా మొబైల్ సమర్పణ.. పోస్ట్ ఆఫెస్ లేదా బ్యాంక్ సమర్పణ. పోస్ట్ మ్యాన్ సహాయంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుంది.