Gummanur Jayaram : పార్టీ మారగానే గట్టిదెబ్బ .. టీడీపీ లోకి వెళ్లిన గుమ్మనూరి జయరాం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gummanur Jayaram : పార్టీ మారగానే గట్టిదెబ్బ .. టీడీపీ లోకి వెళ్లిన గుమ్మనూరి జయరాం..!

 Authored By tech | The Telugu News | Updated on :6 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Gummanur Jayaram : పార్టీ మారగానే గట్టిదెబ్బ .. టీడీపీ లోకి వెళ్లిన గుమ్మనూరి జయరాం..!

Gummanur Jayaram : ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి చేరుతున్నారు.ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీలు మారిన సంగతి తెలిసిందే.ఇంకా ఇప్పటికి పార్టీల మార్పు కొనసాగుతూనే ఉంది.అయితే వైసీపీ నుంచి బయటికి వచ్చిన వాళ్లంతా వైయస్ జగన్ తీరు నచ్చడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. టికెట్ ఇవ్వడం వేరు, వేరే చోట ఇవ్వడం వేరు, ఉన్న ప్రాంతంలో సర్వే బాలేదని వేరే వాళ్లకు సపోర్ట్ చేయమని చెప్పడం ఇవి మూడు వేర్వేరు అంశాలు. ఇలా వైసీపీలో సర్వేల ద్వారా చాలామందిని పక్కన పెట్టారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే ఆయనను పార్లమెంటుకు పంపించాలని వైయస్ జగన్ భావించారు అందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బ్యాలెన్స్ చేయడం వైయస్ జగన్ కి ఛాలెంజింగ్ గా మారింది. ఏదేమైనా సింగిల్గానే వైయస్ జగన్ తన పార్టీ ఎజెండాను మార్చుకోగలిగారు.

ఇక గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే వైసీపీ క్యాడర్ అంత అందుకు విరుద్ధంగా మారుతున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని, టీడీపీలోకి రామని తేల్చి చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం పొంతకల్ నుంచి పోటీ చేయాలని హై కమాండ్ భావించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. దీంతో పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. అయితే క్యాడర్ ఎంత వేరే చోట నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది, ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం సరైనది కాదని, మేమంతా వైసీపీ లోనే ఉంటామని క్యాడర్ తేల్చి చెబుతున్నారు. దీంతో గుమ్మనూరు జయరామ్ ను ఆయన వర్గీయులే వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి వైయస్ జగన్ విధానాలు నచ్చలేదని బహిరంగంగా చెప్పి టీడీపీలోకి చేరారు.

ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పొంతకల్ నుంచి పోటీ చేస్తానని, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అనే ఇద్దరు పూజారులు ఉన్నారని, దాంతో వైఎస్ జగన్ శిల్పంలా మారారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు వైయస్ జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఇలాంటి నాయకులు టికెట్ ఇవ్వలేదని బయటికి వచ్చి విమర్శలు చేయడం ఏమాత్రం సరి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవి ఉన్నన్నాళ్ళు మాకు అంత బెనిఫిట్ గా ఉందని కబుర్లు చెబుతారు. టికెట్ ఇవ్వకపోయేసరికి ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. వైసీపీ లోనే కాదు అటు టీడీపీలో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారు. రాష్ట్రం ప్రజల గురించి ఆలోచించడం పక్కన పెట్టి వారి పదవుల కోసం పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు ప్రజలు ఎటువంటి సమాధానం చెబుతారు చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది