Pawan kalyan : ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్న జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఇటీవల చిలకలూరిపేటలో ప్రజాగలం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందేే. ఇక ఈ ప్రజా గళం సభకు మూడు పార్టీల ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు , నరేంద్ర మోడీ , పవన్ కళ్యాణ్ హాజరవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. అయితే నరేంద్ర మోడీ ప్రజాగలం సభలో మాట్లాడుతూ….అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో మరియు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ కచ్చితంగా ఉండాలి అని మోడీ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడడం అంత బాగానే ఉంది కానీ ప్రసంగంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కానీ చంద్రబాబును ఉద్దేశించి కానీ నరేంద్ర మోడీ మాట్లాడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయ నేతలను ప్రశంసిస్తూ మాట్లాడకపోవడంతో ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రసంగంలో మాట్లాడుతూ టీడీపిఐ జనసేన బీజేపీ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పకుండా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాల్సిందిగా కోరడం జరిగింది.
అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీ పార్టీ కావడం ఇక్కడ గమనార్హం. అయితే మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని ఆశించాలని అనుకున్న చంద్రబాబుకు నరేంద్ర మోడీ గట్టి షాక్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రసంగంలో నరేంద్ర మోడీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎన్డీఏకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్లడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మోడీ ఆరోపించారు. ఈ విధంగా ప్రసంగం మొత్తంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి గెలిపించాలని చెప్పారు తప్ప రాష్ట్ర అధినేతల గురించి మాత్రం చెప్పలేకపోయారు. ఎన్డీఏని కచ్చితంగా గెలిపించాలని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రి చేయండి అని లేదా పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పలేకపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వంటి అనుభవశాలి ముఖ్యమంత్రి అవసరమని ఒక మాట నరేంద్ర మోడీ చెప్పి ఉంటే కచ్చితంగా జనాలలో అది పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేదని పలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారు అనేది మాత్రం తెలియడం లేదు.
ఇక నరేంద్ర మోడీ కేంద్రంలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే డబ్బల్ ఇంజన్ సర్కార్ అవుతుందని అప్పుడు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం నరేంద్ర మోడీ మనసులో ఎవరు సీఎం అభ్యర్థిగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్థానంలో మిత్రపక్షం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తుంది. ఇక దానిలో 88 సాధించటం అనేది కాస్త కష్టమే. దీంతో జనసేనకి బీజేపీ ఎంత తక్కువ సీట్లు వచ్చినా సరే వారికి ప్రముఖ స్థానం ఇచ్చేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా పలువురు పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ చిలకలూరిపేటలో బాబు గురించి ప్రస్తావించకుండా ప్రసంగం ముగించారని టాప్ నడుస్తుంది. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.