YCP MLAS : కేసీఆర్ ఓటమితో వైసీపీ ఎమ్మెల్యేలో భయం.. జగన్ ఆ నిర్ణయం తీసుకోబోతున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP MLAS : కేసీఆర్ ఓటమితో వైసీపీ ఎమ్మెల్యేలో భయం.. జగన్ ఆ నిర్ణయం తీసుకోబోతున్నారా?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం వల్లే కేసీఆర్ ఓడిపోయారా?

  •  ఏపీలో సిట్టింగ్ లకు టికెట్లు వస్తాయా?

  •  భయాందోళనలో వైసీపీ ఎమ్మెల్యేలు

YCP MLAS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మూడో సారి బొక్కబొర్లా పడింది. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం అని గప్పాలు కొట్టిన బీఆర్ఎస్ పార్టీ చివరకు తెలంగాణ   అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడింది. నిజానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్ ఇవ్వడం. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా కూడా కేసీఆర్ అవేవీ పట్టించుకోకుండా వాళ్లకే టికెట్లు ఇచ్చారు. సిట్టింగ్ లను కాదని మార్చిన నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంటే.. కేసీఆర్ చేసిన పెద్ద తప్పు సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వడం. దానితో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీఆర్ మార్చలేదు. ఇప్పుడు ఇవే ఫలితాలు ఏపీలోనూ రిపీట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ పార్టీ కూడా సిట్టింగ్ లకే ఎక్కువగా టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ పరిస్థితే రాబోతోంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని జగన్ ముందు నుంచే అనుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో జగన్ ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు రెడీ అవుతున్నారు. అందరు కాదు కానీ.. ఒక 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం అస్సలు టికెట్ ఇచ్చేదే లేదు అని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు ఒక నియోజకవర్గంలో సీటు ఇవ్వకపోతే ఇంకో నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు అసలు టికెటే ఇవ్వకపోతే ఏం చేయాలి అని కొందరు ఎమ్మెల్యేలను కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ ఇవ్వకపోతే వెంటనే వేరే పార్టీలోకి వెళ్లి కనీసం ఆ పార్టీ నుంచి అయినా కూడా టికెట్ తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

YCP MLAS : జగన్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?

తెలంగాణలో కేసీఆర్ ఎవ్వరి మాటా వినకుండా సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చి పెద్ద పొరపాటు చేశారు. జగన్ కూడా ఆ పొరపాటు చేయకుండా ఆయనకు తెలంగాణ ఎన్నికలు ఒక ఉదాహరణగా నిలవడంతో ఇక తమ టికెట్ కు ఎసరు తప్పుదు అనుకొని కొందరు ఎమ్మెల్యేలు ముందే సర్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు టికెట్ రాదు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు అని భావిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడే తట్టా బుట్టా సర్దుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది