Ysrcp : వైకాపా ఓటమికి అపవిత్ర కూటమి… ఇలాంటి రాజకీయం దారుణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : వైకాపా ఓటమికి అపవిత్ర కూటమి… ఇలాంటి రాజకీయం దారుణం

 Authored By himanshi | The Telugu News | Updated on :8 March 2021,6:50 pm

Ysrcp  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి హావ రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తూ ప్రజల మెప్పు పొందుతున్నాడు. జగన్ పాలనా బాగుండడం తో ప్రజలు ఆయనకే పట్టం కడుతున్నారు. శాసన ఎన్నికల్లోనేకాదు , మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఓటర్లు వైసీపీ కి ఎక్కువ స్థానాలు ఇచ్చారు.

ఇక త్వరలో మున్సీపాలటీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఎలాగైనా వైసీపీ పార్టీ ని ఓడించాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు..ఇప్పుడు కలిసి పనిచేస్తూ జగన్ ఓటమిని కోరుకుంటున్నారు.

janasena tdp alliance Again

janasena tdp alliance Again

అందుకే జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగుదేశం నేతలు , కార్య కర్తలు తెగ కష్టపడుతూ ప్రచారం చేస్తున్నారు. విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కీలక నేతలైన వంగవీటి రాధా, చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేపట్టడం అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. విజయవాడ రామలింగేశ్వర నగర్ వార్డు జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

కాకపోతే టీడీపీ అభ్యర్థులు లేని డివిజన్‌లలో మాత్రమే జనసేన కోసం వీరు ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీ అభ్యర్థుల ఓటమిని కోరుతున్నారు. రీసెంట్ గా రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను , వైసీపీ నేతలు బెదిరించడం , కొట్టడం వంటివి చేయడం తో ఈసారి చాలామంది టీడీపీ కార్య కర్తలు పోటీ చేసేందుకు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు ప్రచారం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది