Janasena : జగన్ ఇలాఖాలో అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్.. ఆ నియోజకవర్గాలను కావాలనే పవన్ టార్గెట్ చేశారా?
Janasena : సీఎం జగన్ సొంత ఇలాఖా ఏదో తెలుసు కదా. వైఎస్సార్ కడప జిల్లా. కడప జిల్లా మొత్తం వైఎస్సార్ ఫ్యాన్స్, వైఎస్ జగన్ ఫ్యాన్సే ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే అది వైసీపీకి కంచుకోట. కానీ.. ఆ జిల్లాపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కావాలని జగన్ ఇలాఖాను పవన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కడపలో జనసేన పార్టీ పాగా వేయాలని పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. తమకు కడపలో కూడా బలం ఉంది.. అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అందుకే.. కడపలో కూడా ఫోకస్ పెట్టి జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో తమ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన జనసేన నేతలతో సర్వేలు కూడా చేయించారట. అందులో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మంచి పట్టు ఉన్నట్టుగా పవన్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీని దించాలని పవన్ యోచిస్తున్నారట.ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసా? మైదుకూరు, కోడూరు, బద్వేలు, రాజంపేట.. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచేలా పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ.. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని మైదుకూరులో టీడీపీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Janasena : ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసా?
దానికి కారణం.. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. అందుకే.. ఆయనకు టికెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. అదే మైదుకూరులో జనసేనకు కూడా బలం ఉండటం, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆయనకు టికెట్ ఇచ్చి అక్కడ పోటీకి పెడితే మైదుకూరులో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ.. టీడీపీ ఆ నియోజకవర్గాన్ని జనసేనకు వదిలేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.