YS Vijayamma : YS విజయమ్మతో JC ప్రభాకర్ రెడ్డి మీటింగ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది..?
ప్రధానాంశాలు:
YS Vijayamma : YS విజయమ్మతో JC ప్రభాకర్ రెడ్డి మీటింగ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది..?
YS Vijayamma : ఏపీ రాజకీయాల్లో రోజుకొక కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. లేటెస్ట్ గా మరో ఫోటో సంచలనంగా మారింది. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తో భేటీ రాజకీయాల్లో చర్చకి దారి తీసింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో YS విజయమ్మను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. అయితే వీరు ఎందుకు కలిశారు..? వారి మధ్య ఏం చర్చ జరిగింది అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ ను ఘోరంగా దూషించారు. మామూలుగా కాదు బూతులతో దూషించడం జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్ మీద భారీ ఎత్తున కేసులు పెట్టి రివెంజ్ తీర్చుకున్నాడు. గత ఐదేళ్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా కేసులను ఎదుర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ టైం లోనే అనంతపురం జిల్లాలో చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్ 2014లో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడిపత్రి నుంచి జేసీ ఎమ్మెల్యేగా, అనంతపురం నుంచి ఎంపీగా దివాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వీరికి బదులుగా వీరిద్దరి వారి వారసులను బరిలోకి దించితే వారు ఓటమి పాలయ్యారు. రీసెంట్ ఎలక్షన్స్ లో జేసీ కుటుంబంలో ఒక్కరికే సీటు కేటాయించగా తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి విజయం సాధించారు.
YS Vijayamma జేసీతో విజయమ్మ వారి గురించి చర్చ..
జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రస్తుతం అక్కడ మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు సడెన్ గా ఉన్నట్టుండి వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి చర్చించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు జేసీ విజయమ్మ ని ఎందుకు కలిశారు. విజయమ్మ తో జేసీ సోఫాలో పక్కపక్కనే కూర్చోవడం ఇదంతా సోషల్ మీడియా లో చర్చ కు దారి తీస్తుంది.

YS Vijayamma : YS విజయమ్మతో JC ప్రభాకర్ రెడ్డి మీటింగ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది..?
విజయమ్మతో సుమారు అరగంట పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి మీటింగ్ జరిగింది. కేవలం విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే ప్రభాకర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. అంతే కాదు వీరి మధ్య వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ మీటింగ్ పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.