jd lakshminarayana : విశాఖ గెలుపు కోసం జేడీ పక్కా వ్యూహం.. పవన్ తో దూరం అయ్యి ఆయన స్నేహితులతోనే స్నేహం
jd lakshminarayana : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారన సమయంలో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ పేరు ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన్ను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ విధుల నుండి తప్పుకున్న తర్వాత సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశారు. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అయ్యాడు. వైజాగ్ పార్లమెంట్ సీటును ఆశించిన జేడీ లక్ష్మి నారాయణకు పవన్ ఆ సీటును కట్టబెట్టాడు. అనుకున్నట్లుగానే జేడీకి అక్కడ మంచి మద్దతు లభించింది. కాని గెలవలేక పోయాడు. జనసేన పార్టీ కాకుండా మరే పార్టీలో చేరినా కూడా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది, ఇప్పటికే ఆయన ఎంపీగా ఉండేవాడు అంటూ ఆయన మద్దతుదారులు అంటున్నారు. పవన్ రాజకీయాలు మరియు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న కారణంగా తనకు నచ్చడం లేదు అంటూ జనసేన పార్టీని వదిలేసిన జేడీ త్వరలో బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మొదటి నుండి బీజేపీతో సన్నిహిత్యం…
పదవి నుండి దూరం అయినప్పటి నుండి కూడా జేడీ బీజేపీతో దగ్గర అవుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గత ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంట్ స్థానంను వైకాపా ఇచ్చేందుకు నిరాకరించడం వల్లే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వైకాపా కు బీజేపీకి దూరంగా ఉంటుంది. అందుకే బీజేపీలో జాయిన్ అవ్వడంతో పాటు విశాఖ ఎంపీ స్థానం కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు.
విశాఖపై ముందస్తు వ్యూహం..
జనసేన మరియు బీజేపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. గత ఎన్నికల్లో విశాఖలో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ఆయన వచ్చే సారి మాత్రం బీజేపీ తరపున జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కనుక జేడీ చేరికను ఖచ్చితంగా బీజేపీ నాయకులు సమర్థిస్తాయి. ఆ విషయంలో జేడీ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే విశాఖ పార్లమెంట్ స్థానంపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు అక్కడ తన ప్రాభవంను కాపాడుకుంటూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో 2.8 లక్షల ఓట్లను దక్కించుకుని స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అందుకే వచ్చే సారి ఘన విజయం సాధించడం ఖాయం అంటున్నారు.