Jeevitha VS Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి జీవితా రాజశేఖర్ స్ట్రాంగ్ కౌంటర్?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 16, 2023, 12:00 pm
  •  జగన్ ని పొగడ్తల్లో ముంచెత్తిన జీవితా రాజశేఖర్

  •  జగన్ మళ్లీ గెలవాలని ఆశించిన జీవిత

  •  ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్

Jeevitha VS Chiranjeevi : ఇప్పుడు కాదు.. సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి రాజశేఖర్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి అస్సలు పడదు. అవును.. అది ఎందుకు అనేది పక్కన పడితే ఈ రెండు కుటుంబాల మధ్య శతృత్వం కొన్నేళ్ల పాటు నడిచింది. చివరకు రాజశేఖర్ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కేవలం మెగా ఫ్యామిలీ వల్లనే జరిగింది. ఇదంతా పక్కన పెడితే జీవిత, రాజశేఖర్ ఇద్దరూ వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలుసు కదా. వీళ్లిద్దరూ వైసీపీలో చేరి ఇప్పుడు వైసీపీకి మద్దతు పలుకుతూ ఏపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జీవిత రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజశేఖర్ ఒక చిన్నపిల్లాడిలా ఉంటారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన మనసులో ఏది ఉన్నా ముందే మాట్లాడేస్తారు. అదే జగన్ విషయంలో జరిగింది. ఏదీ ఎక్కడా ఎవ్వరూ ప్రూవ్ చేసుకోలేదు. అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం చాలా ఈజీ. రాజశేఖర్ ఇలా.. జీవిత ఇలా.. జగన్ గారు ఇలా అంటూ ఆరోపణలు చేయడం చాలా ఈజీ అంటూ జీవిత చెప్పుకొచ్చారు.

ఎదుటి వాళ్ల గురించి ఏదైనా అంటే ఎంజాయ్ చేసేవాళ్లు ఈరోజుల్లో ఎక్కువగా ఉన్నారు. జగన్ గారి మీద వేసిన ఆరోపణలు అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆయన ఎదుగుదల చూశాం. ఆయన పడ్డ కష్టాలు చూశాం. ఆయన జైలుకు వెళ్లడం చూశాం. ఆయన మీద చేసిన ఆరోపణలు అన్నీ ఆరోపణలు గానే మిగిలిపోయాయి. ఆయన జైలు నుంచి బయటికి వచ్చాక కూడా ప్రజల గురించే ఆలోచించారు. పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఆయన చాలా మారిపోయారు. ఆయన ఎంత కష్టపడతారో.. ఆయన్ను చూస్తేనే అర్థం అవుతోంది. ఆయన్ను ఎంత మంది తొక్కేయాలని చూసినా.. ఒక బంతిలా బౌన్సింగ్ బ్యాక్ అవుతున్నారు. అదే ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు అంటూ జీవిత చెప్పుకొచ్చారు.

Jeevitha VS Chiranjeevi : ఇలాంటి వ్యక్తే మనకు మరోసారి సీఎం కావాలి

ఇంత పట్టుదల ఉన్న వ్యక్తి మరోసారి సీఎం కావాలి అంటూ జీవిత చెప్పుకొచ్చారు.  జగన్ గారు ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలకు తిండి ఉందా.. కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా అనే దానిపై ఆలోచించారు. వైఎస్సార్ కొడుకుగానే కాకుండా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరుచుకున్నారు జగన్. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు. అందుకే జగన్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. మరోసారి అవకాశం ఇవ్వాలి. జగన్ కు మళ్లీ ఓటు వేసి గెలిపించాలి అని జీవిత స్పష్టం చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp