Kandula Durgesh : సినిమా రంగానికి వ్యతిరేఖంగా ఎప్పుడైన నిర్ణయాలు తీసుకున్నామా.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
సినిమా రంగానికి వ్యతిరేఖంగా ఎప్పుడైన నిర్ణయాలు తీసుకున్నామా.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!
Kandula Durgesh : రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి దుర్గేశ్ హామీ ఇచ్చారు.

Kandula Durgesh : సినిమా రంగానికి వ్యతిరేఖంగా ఎప్పుడైన నిర్ణయాలు తీసుకున్నామా.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!
Kandula Durgesh కీలక వ్యాఖ్యలు..
సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తాం. తెలుగు సినిమా పరిశ్రమ మన రాష్ట్రానికి గర్వకారణం, దానికి తగిన ప్రోత్సాహం అందించడం మా బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు అడుగుతున్నారు. టికెట్ ధర ఒక్క రూపాయి పెంచితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పావలా మాత్రమే అని ఆయన అన్నారు.
టికెట్ ధరల పెంపు హోం శాఖ పరిధిలో ఉంటాయి.నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలపై ఆధారపడి వందలాది కుటుంబాలు ఉన్నాయి. టికెట్ రేటు పెంచితే వారికి ఉపయోగపడుతుంది. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడైన సినీ పరిశ్రమకి వ్యతిరేఖంగా నిర్ణయాలు తీసుకున్నామా అని ఆయన ప్రశ్నించారు.