Chandrababu : చంద్రబాబుకు తలనొప్పిగా మారిన వైఎస్ జగన్ సంతకాలు..!
Chandrababu : గత ప్రభుత్వం వైసీపీ తీసుకున్న అనేక నిర్ణయాలు, పథకాలను మార్చేస్తూ చంద్రబాబు తన మార్క్ పరిపాలన చేస్తున్నారు. ఐతే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టాలనుకున్న ప్రథకాలు కొన్ని విషయాల్లు బాబుకి పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తుంది. జగన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసుకున్న ఒప్పందాలు, చేసిన సంతకాలు వాటిని మార్చలేక ప్రభుత్వానికి ఇబ్బందిగా తయారైంది. ఐతే ఒకరకంగా చూస్తే బాబుకి ఆ ఒప్పందాలను రద్దు చేయాలని ఉన్నా కేంద్రంలో ఉన్న బేజేపీతో పొత్తు ఉందటం […]
ప్రధానాంశాలు:
Chandrababu : చంద్రబాబుకు తలనొప్పిగా మారిన వైఎస్ జగన్ సంతకాలు..!
Chandrababu : గత ప్రభుత్వం వైసీపీ తీసుకున్న అనేక నిర్ణయాలు, పథకాలను మార్చేస్తూ చంద్రబాబు తన మార్క్ పరిపాలన చేస్తున్నారు. ఐతే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టాలనుకున్న ప్రథకాలు కొన్ని విషయాల్లు బాబుకి పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తుంది. జగన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసుకున్న ఒప్పందాలు, చేసిన సంతకాలు వాటిని మార్చలేక ప్రభుత్వానికి ఇబ్బందిగా తయారైంది. ఐతే ఒకరకంగా చూస్తే బాబుకి ఆ ఒప్పందాలను రద్దు చేయాలని ఉన్నా కేంద్రంలో ఉన్న బేజేపీతో పొత్తు ఉందటం వల్ల వాటిని కాదనలేని పరిస్థితి అని తెలుస్తుంది. ముఖ్యంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు బాబుకి పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తుంది. అందులో ఒకటి చెత్త పన్ను కాగా మరోటి స్మార్ట్ మీటర్లు.
Chandrababu చెత్త పన్నుతో కేంద్రం నుంచి అదనపు అప్పు..
జగన్ హయాంలో 2020లో ఇది ఏర్పాటు చేశారు. చెత్త పన్ను ద్వారా వచ్చిన ఆదాయంతో కేంద్రం ప్రభుత్వం నుంచి అదనపు అప్పు తీసుకునేలా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐతే కూటమి అధికారంలోకి వస్తే చెత్త పన్ను తీసేస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు ఆ చెత్త పన్ను తీసేస్తే కేంద్రం నుంచి అప్పు తెచ్చుకునే వెసులుబాటు లేకుండా పోతుంది. ఇక రెండో అంశం గా ఉన్న స్మార్ట్ మీటర్లు.. రైతులకు వినియోగిస్తున్నారు. ఐతే రాష్ట్రంలో రైతులు విద్యుత్తు మీటర్లు పెట్టాలని.
ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలని కేంద్రం చెబుతున్నా దీని అమల్లో పెట్టడం వల్ల కూడా కేంద్రం నుంచి 0.5% అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఐతే జగన్ ఆ అప్పు కోసమే రాష్ట్రం మొత్తం మీటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కాగా ఎన్నికల ముందు దీన్ని వ్యతిరేకించిన బాబు ఇపుడు వీటిని తీసేయడం కూడా సమస్యగా మారడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుల కోసమైనా సరే జగన్ చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబుకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగించే పరిస్థితి ఏర్పడింది.