Kodali Nani : ముంబై AIG హాస్పటల్ కు కొడాలి నాని తరలింపు..!
ప్రధానాంశాలు:
Kodali Nani : ముంబై AIG హాస్పటల్ కు కొడాలి నాని తరలింపు..!
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనకు వైద్యులు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గుండెలో మూడు వాల్వులు బ్లాక్ కావడంతో, నిపుణుల సలహాతో ఈ సర్జరీ చేయబోతున్నారు. కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన డిశ్చార్జ్ అయ్యి, ముంబైకి వెళ్లనున్నారు. ముంబైలోని ప్రసిద్ధ ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయనకు బైపాస్ సర్జరీ చేయనున్నారు.

Kodali Nani : ముంబై AIG హాస్పటల్ కు కొడాలి నాని తరలింపు..!
Kodali Nani ముంబై లో కొడాలి నానికి సర్జరీ
ఈ ఆపరేషన్‌ను ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ రామకాంత్ పాండా నిర్వహించనున్నారు. డాక్టర్ పాండా గతంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఏపీ రాజకీయ నాయకులు కొనకళ్ల నారాయణ, ఎంపీ రఘురామకృష్ణంరాజులకు కూడా బైపాస్ సర్జరీ నిర్వహించారు. అత్యంత అనుభవం కలిగిన వైద్యుడిగా పేరు గాంచిన పాండా, గుండె సంబంధిత శస్త్రచికిత్సలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. కొడాలి నానికి రేపు లేదా ఎల్లుండి బైపాస్ సర్జరీ నిర్వహించనున్నట్లు సమాచారం.
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తెలిసిన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయనకు విజయవంతంగా సర్జరీ పూర్తవ్వాలని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.