Kodela Son – YSRCP : కోడెల కొడుకుని వైసీపీ లోకి రాకుండా ఆపడం ఇంపాజిబుల్ .. మొత్తం డిస్కషన్ అయిపోయింది జంప్ కి రెడీ?
Kodela Son – YSRCP : కోడెల శివప్రసాద రావు తెలుసు కదా. ఆయన టీడీపీలో చాలా ఏళ్ల పాటు కొనసాగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీకి స్పీకర్ గా పనిచేశారు. గుంటూరు జిల్లాలో అయితే కోడెల ఏది చెబితే అదే వేదం. చంద్రబాబుకు కూడా ఆయన ఆప్తుడు. కోడెల శివ ప్రసాద రావును పల్నాడు పులిగా ముద్దుగా చంద్రబాబు పిలుచుకునేవారు. అలాంటి కోడెల అనూహ్యంగా మరణించడంతో టీడీపీకి తీరని లోటు ఏర్పడింది. పల్నాడు జిల్లాలో టీడీపీకి గట్టిదెబ్బ పడింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే.. కోడెల బతికి ఉన్నప్పుడు ఆయన్న పల్నాడు పులిలా చూసుకున్న చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత అసలు కోడెల కుటుంబాన్నే పట్టించుకోవడం మరిచారు. అవును.. కోడెల కుటుంబాన్ని పార్టీకి దూరం పెడుతూ వచ్చారు. కోడెల శివప్రసాదరావు తర్వాత ఆయన కొడుకు రాజకీయాల్లో తన వారసత్వానికి పుణికిపుచ్చుకొని రావాలని కలలు కన్నారు. కానీ.. చంద్రబాబు ఇప్పుడు ఆయన కొడుకును పట్టించుకోవడం లేదు.నిజానికి.. 2019 లో టీడీపీ పార్టీనే ఘోరంగా ఓడిపోయింది. కోడెల కూడా ఓడిపోయారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ చార్జ్ పదవిని కోడెల చనిపోయాక ఆయన కొడుకుకు కూడా ఇవ్వలేదు. కోడెల శివరాం సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నా.. రాయపాటి కొడుకు అడ్డం వస్తున్నారు.
Kodela Son – YSRCP : 2019 లో శివప్రసాదరావు ఓడిపోవడమే కారణమా?
దీంతో చివరకు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా కన్నాను నియమించారు చంద్రబాబు. దీంతో చంద్రబాబుపై కోడెల కుటుంబం ఆగ్రహంగా ఉంది. పార్టీ ప్రారంభం నుంచి శివప్రసాదరావు తోడుగా ఉంటే ఇప్పుడు ఆయన వారసుడిని కాదని వేరే వ్యక్తికి ఇవ్వడం ఏంటని.. తన అనుచరులతో కలిసి పలుమార్లు భేటీ అయిన శివరాం.. చివరకు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కోడెల శివరాంకు టికెట్ కన్ఫమ్ అని వైసీపీ నుంచి కబురు వస్తే వెంటనే టీడీపీని వదిలి వైసీపీలో చేరాలని అనుకుంటున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో?