Kommineni Srinivasa Rao : లైవ్‌లో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు.. వీడియో !
ప్రధానాంశాలు:
Kommineni Srinivasa Rao : లైవ్‌లో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు
Kommineni Srinivasa Rao : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు కంటతడి పెట్టుకున్నారు. అరెస్ట్‌కు వెళ్తారని అనుకోలేదు. అన్నింటికీ మానసికంగా సిద్ధపడాలని అనుకున్నా. నాకు తెలిసి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎవరైనా గారు అనకపోతే నేను ఊరుకోను.

Kommineni Srinivasa Rao : లైవ్‌లో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు.. వీడియో !
Kommineni Srinivasa Rao : భావోద్వేగంతో..
అలాంటి నాపైన., నా వ్యక్తిత్వం, విశ్వసనీయత, నా ఇంటిగ్రిటీని దెబ్బతీసేందుకు కుట్ర జరగడం నాకు ఆవేదన కలిగించింది. ఈ జీవిత చరమాంకంలో, వృత్తి చరమాంకంలో ఇలా జరగడం బాధ కలిగిస్తోంది. నాకు ఇప్పుడు 70 ఏళ్లు. ఇంకెంత కాలం బతుకుతా.. ఎంతకాలం పనిచేస్తా? ఈ వయసులో, ఈ 50 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రాని మచ్చతో నా జీవితాన్ని చాలించాల్సి వస్తుందా.. ఊపిరి పోతుందా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
అంతేకానీ అరెస్ట్‌కు భయపడలేదు. ఇలాంటి మచ్చ వేస్తారా..” అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తను అరెస్టైన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ క్రమంలోనే ఆ పరిణామాలను తలుచుకుని కొమ్మినేని ఎమోషనల్ అయ్యారు.
తన అరెస్ట్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్న కొమ్మినేని శ్రీనివాస్ రావు
Video Credits – Sakshi pic.twitter.com/Xi37WOBD5p
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2025