Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

  •  చీప్ పబ్లిసిటీ కోసం బ్రతకడం మానేయ్ అంటూ కూతురికి ముద్రగడ హెచ్చరిక

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఓ లేఖలో ఆయన తన ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలపై లోతుగా స్పందించారు. గత కొన్ని నెలలుగా తమ కుటుంబంపై ఓ కుటుంబం ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోందని, వారితో గతంలోనే మనస్పర్ధలు వచ్చాయని, ఒక సంవత్సరం నుండి సంబంధాలన్నీ తెగిపోయాయని ఆయన పేర్కొన్నారు. తన చిన్న కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూసి వారికి అసూయ కలుగుతోందని ఆరోపించారు.

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : చీప్ పబ్లిసిటీ కోసం బ్రతకడం మానేయ్ అంటూ కూతురికి ముద్రగడ హెచ్చరిక

తనకు క్యాన్సర్ వచ్చిందని, ఇంట్లో బంధించి ఉంచారనే ప్రచారం అవాస్తవమని ముద్రగడ స్పష్టం చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, దీనికి 100 శాతం కారణం తన చిన్న కుమారుడేనని పేర్కొన్నారు. గతంలో తన భార్య అనారోగ్యంతో బాధపడినప్పుడు చికిత్స అనంతరం విశ్రాంతికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇంటి నుండి వెళ్ళమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎన్ని జన్మలు వచ్చినా కొంతమంది ఇంటి గుమ్మలను చూడబోనని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూతురు క్రాంతి పైనే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తన ఆరోగ్య పరిస్థితిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని హెచ్చరించిన ముద్రగడ, ఆ కుటుంబం ప్రభుత్వానికి జీ.వోలు సలహా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. నిజంగా సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తే, కాపు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయించండి అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ లను చూస్తే జాలి కలుగుతోందని, ఇకనైనా చీప్ పబ్లిసిటీ కోసం బ్రతకడం మానేయాలంటూ కూతురు క్రాంతిని ఉద్దేశిస్తూ హితవు పలికారు. ఈ లేఖ ఇప్పుడు రాజకీయ, కుటుంబ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి