Nominated Posts : రేపే నామినేటెడ్ ప్రకటన.. ఎవరెవరిని అదృష్టం వరిస్తుందో మరి..!
ప్రధానాంశాలు:
Nominated Posts : రేపే నామినేటెడ్ ప్రకటన.. ఎవరెవరిని అదృష్టం వరిస్తుందో మరి..!
Nominated Posts : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే నాలుగు నెలలు అయింది. అయితే అన్నీ పరిశీలించి మూడు పార్టీలకి చెందిన కొందరు నేతలకి కీలక పదవులు అప్పగించారు. ఇక ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. తుది కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా….మరో సారి వడపోత కోసం వాయిదా వేసారు. దసరాకు ముందే పదవులను ప్రకటించే లా చంద్రబాబు ఆలోచన చేసిన దాని కోసం కాస్త టైం తీసుకున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలకు చెందిన వారు అంతా పదవులు తమకు దక్కుతాయని బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు.
Nominated Posts నిర్ణయం ఎలా ఉంటుందో..
అయితే నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పదవులు అప్లై చేయాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. చంద్రబాబు కూటమిలోని జనసేన బీజేపీల విషయంలో ఆయా పార్టీల అధినాయకత్వానికి ఎంపిక చేసే బాధ్యతను ఒదిలేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారి వివరాలు అన్నీ అధినాయకత్వం పరిశీలిస్తుందని ఆ మీదట అన్నీ చూసుకుని పదవులు పంపిణీ చేస్తుందని ఇది ఒక ప్రాసెస్ అని నారా లోకేష్ ఇటీవల మీడియాకి చెప్పారు. తొలి విడతలో ఇరవై కార్పోరేషన్ల చైర్మన్ పదవులు, పాలక వర్గాలను ఎంపిక చేశారు. ఇందులో పదిహేడు పదవులు టీడీపీ తీసుకుంటే రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చారు. ఇక ఇపుడు మరో ఇరవై కార్పోరేషన్ల పదవులు భర్తీ చేస్తారా లేక ఆ సంఖ్య ముప్పయికి చేరుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.
ఏపీలో ఉన్న కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం సగం అయినా రెండవ విడతలో భర్తీ చేయాలని కూటమిలోని ఆశావహులు కోరుతున్నారు. ఈసారి ముప్పయి కార్పోరేషన్లు భర్తీ చేస్తే టీడీపీకి పాతిక దాకా దాకుతాయి. జనసేనకు మూడు బీజేపీకి రెండు దక్కే వీలు ఉంటుందని లెక్కలేస్తున్నారు. తొలివిడత భర్తీలో గోదావరి విశాఖ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నెల 16న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. అది పూర్తి కాగానే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉండొచ్చు అని అంటున్నారు. బీజేపీ హై కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో టీడీపీ అధినాయకత్వానికి ఏ రకమైన సిఫార్సులు చేస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఈ ఏడాది చివరి లోగా మొత్తం వంద కార్పోరేషన్లకు నియామకాలు చేపట్టడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.