Ramoji Rao : రామోజీరావు కోడలు ఏమైపోయింది.. లుక్ అవుట్ నోటీసులతో దిగిన పోలీసులు..!
Ramoji Rao : రామోజీ గ్రూప్ లో ఏం జరుగుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇప్పుడు రామోజీ రావుకి లేనిపోని తలనొప్పి తీసుకొచ్చింది. తాజాగా ఏపీ సీఐడీ.. మార్గదర్శి ఎండీ సీహెచ్ శైలజకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై శైలజా కిరణ్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లుక్ ఔట్ నోటీసులను ఆమె సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి కారణం.. ఆమె ప్రస్తుతం ఇక్కడ లేకపోవడమే. ఆమె ప్రస్తుతం యూఎస్ లో ఉన్నారు.
అందుకే తాను అమెరికాలో ఉన్నానని.. త్వరలోనే వస్తున్నానని కోర్టుకు తెలిపారు. లుక్ ఔట్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, దానికి సంబంధించిన ఆదేశాలు ఏపీ సీఐడీకి ఇవ్వాలని కోరుతూ శైలజా కిరణ్ తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి.. అమరావతి పోలీస్ స్టేషన్ లో మార్గదర్శి సంస్థపై నమోదైన కేసుల విషయంలో ఏపీ సీఐడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఏపీ సీఐడీ మాత్రం ఖాతరు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
Ramoji Rao : జూన్ 6 న విచారణకు రావాలని శైలజా కిరణ్ కు ఆదేశాలు
జూన్ 6న పిటిషనర్ ఎలాగైనా విచారణకు రావాలని శైలజా కిరణ్ కు సీఐడీ లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు పిటిషనర్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని.. విచారణకు శైలజా సహకరిస్తున్నప్పటికీ కావాలని లుక్ ఔట్ నోటీసులను సీఐడీ జారీ చేసిందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అలాగే.. యూఎస్ నుంచి ఇండియాకు వస్తున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో అధికారులు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని.. పిటిషనర్ కు ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఆదేశాలు ఇవ్వాలని శైలజ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.