Ysrcp : వైఎస్‌ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వైసీపీ అభ్య‌ర్ధుల‌లో భారీ మార్పులా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : వైఎస్‌ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వైసీపీ అభ్య‌ర్ధుల‌లో భారీ మార్పులా?

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : వైఎస్‌ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వైసీపీ అభ్య‌ర్ధుల‌లో భారీ మార్పులా?

Ysrcp : మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది. వైసీపీని ఓడించాల‌ని టీడీపీ, బీజేపీ,జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌గా జ‌గ‌న్ మాత్రం సోలోగా బ‌రిలోకి దిగ‌తున్నాడు. అయితే ఇప్ప‌టికే త‌మ పార్టీ నేత‌ల‌కి సంబంధించి ఆరాలు తీస్తున్నాడు జ‌గ‌న్. ఇక ఆయ స్థానాల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ని బరిలోకి దింపే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నార‌నే టాక్ వినిపిస్తుంది. గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉన్న కిలారి రోశయ్యను గుంటూర నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయిస్తారు అనే టాక్ వినిపిస్తుంది.

Ysrcp : భారీ మార్పులు…

ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్న మనోహర్ నాయుడు స్థానంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కి చాన్స్ ఇస్తారనే టాక్ ఉంది. బీసీ ప్ర‌యోగం అని ప్ర‌య‌త్నించిన ఇప్పుడు పార్టీలో బలమైన నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ ని ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అలాగే కర్నూల్ లో చూస్తే కేఈ కుటుంబం వైసీపీలో చేరుతోంది. దాంతో కేఈ ప్రభాకర్ ని కర్నూల్ ఎంపీగా పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక పెనమలూరికి పంపించిన మంత్రి జోగి రమేష్ ని మైలవరం తీసుకురాబోతున్న‌ట్టు తెలుస్తుంది. జోగి రమేష్ ది మైలవరం కాగా ఆయ‌నని పెన‌మ‌లూరుకి పంపారు. ఇప్పుడు అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి సీటు పొందారు.దీంతో జోగి ర‌మేష్‌ని వెన‌క్కి తేన‌నున్న‌ట్టు స‌మాచారం.

Ysrcp వైఎస్‌ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం వైసీపీ అభ్య‌ర్ధుల‌లో భారీ మార్పులా

Ysrcp : వైఎస్‌ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వైసీపీ అభ్య‌ర్ధుల‌లో భారీ మార్పులా?

ఇక జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ ని విజయవాడ వెస్ట్ నుంచి అభ్యర్ధిగా నిలబెడతారు అని అంటున్నారు. ఇక్కడ మైనారిటీ అభ్యర్ధికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇపుడు మారుస్తోంది అని అంటున్నారు. పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరిని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె జనసేన నుంచి వైసీపీలో చేరారు. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా ఉన్న సిం హాద్రి చంద్రశేఖర్ ని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక రాయచోటి సీటుని రెడ్డప్పగారి రమేష్ రెడ్డికి ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద భారీ మార్పులే వైసీపీలో ఉంటాయ‌ని, మ‌రోసారి గెలిచే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది