
Ysrcp : వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం.. వైసీపీ అభ్యర్ధులలో భారీ మార్పులా?
Ysrcp : మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. వైసీపీని ఓడించాలని టీడీపీ, బీజేపీ,జనసేన కూటమిగా ఏర్పడగా జగన్ మాత్రం సోలోగా బరిలోకి దిగతున్నాడు. అయితే ఇప్పటికే తమ పార్టీ నేతలకి సంబంధించి ఆరాలు తీస్తున్నాడు జగన్. ఇక ఆయ స్థానాలలో బలమైన అభ్యర్ధులని బరిలోకి దింపే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారనే టాక్ వినిపిస్తుంది. గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉన్న కిలారి రోశయ్యను గుంటూర నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయిస్తారు అనే టాక్ వినిపిస్తుంది.
ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్న మనోహర్ నాయుడు స్థానంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కి చాన్స్ ఇస్తారనే టాక్ ఉంది. బీసీ ప్రయోగం అని ప్రయత్నించిన ఇప్పుడు పార్టీలో బలమైన నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కర్నూల్ లో చూస్తే కేఈ కుటుంబం వైసీపీలో చేరుతోంది. దాంతో కేఈ ప్రభాకర్ ని కర్నూల్ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పెనమలూరికి పంపించిన మంత్రి జోగి రమేష్ ని మైలవరం తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. జోగి రమేష్ ది మైలవరం కాగా ఆయనని పెనమలూరుకి పంపారు. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి సీటు పొందారు.దీంతో జోగి రమేష్‌ని వెనక్కి తేననున్నట్టు సమాచారం.
Ysrcp : వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం.. వైసీపీ అభ్యర్ధులలో భారీ మార్పులా?
ఇక జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ ని విజయవాడ వెస్ట్ నుంచి అభ్యర్ధిగా నిలబెడతారు అని అంటున్నారు. ఇక్కడ మైనారిటీ అభ్యర్ధికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇపుడు మారుస్తోంది అని అంటున్నారు. పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరిని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె జనసేన నుంచి వైసీపీలో చేరారు. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా ఉన్న సిం హాద్రి చంద్రశేఖర్ ని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాయచోటి సీటుని రెడ్డప్పగారి రమేష్ రెడ్డికి ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద భారీ మార్పులే వైసీపీలో ఉంటాయని, మరోసారి గెలిచే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.