Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో
ప్రధానాంశాలు:
మంత్రి ఆనం వ్యాఖ్యలకు షాక్ తిన్న మంత్రి లోకేష్
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి Anam Ramanarayana Reddy చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌ను ఉపయోగించి వీఆర్ హైస్కూల్ అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఖజానా నుంచి ఏ నిధులు ఉపయోగించలేదని స్పష్టంగా ప్రకటించారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధిపై వస్తున్న విమర్శలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ పాఠశాలకు ఎప్పుడు నిధులు మంజూరు చేశారో స్పష్టంగా చెప్పాలని కమిషనర్‌ను బహిరంగంగా సవాల్ చేశారు. ప్రభుత్వ నిధులతో కాదు, కార్పొరేట్ ఫండ్స్‌తోనే అభివృద్ధి పనులు జరిగాయని పునరుద్ఘాటించారు. ఇది పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు తగవని అన్నారు.

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో
Anam Ramanarayana Reddy : లోకేష్ ముందే కూటమి సర్కార్ కు చెడ్డ పేరు వచ్చేలా మంత్రి ఆనం వ్యాఖ్యలు
ఆనం చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కూటమి వర్గాల్లో కలకలం రేపాయి. ఒక మంత్రి, అది కూడా అధికార ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం వింతగా మారింది. నారా లోకేశ్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు రావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. మరోపక్క ఇదే సభలో లోకేష్ మాట్లాడుతూ..150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని… ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ వీఆర్ హైస్కూల్‌ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని... అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారన్నారు.
సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో పేద కుటుంబమే ఉండకూడదని… ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు P4 తీసుకొచ్చారని తెలిపారు.
నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు
కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్‌తో వీఆర్ హైస్కూల్ అభివృద్ధి చేశారంటూ వ్యాఖ్యలు
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎప్పుడు మంజూరు చేశారో కమిషనర్ చెప్పాలన్న ఆనం https://t.co/Y5D7W4rTdH pic.twitter.com/RAywiCuwBS
— BIG TV Breaking News (@bigtvtelugu) July 7, 2025