Kolusu Parthasarathy : వాలంటీర్స్‌ని ఉంచుతారా, పీకేస్తారా.. మంత్రి పార్ధసారధి సంచలన కామెంట్స్..!
Kolusu Parthasarathy : ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ కూటమి అధికారంలోకి రావడం మనం చూశాం. కొత్త ప్రభుత్వం అన్ని పనులని చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటనేది చర్చగా మారింది. ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ విధుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను నియమించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. +
Kolusu Parthasarathy వ్యవస్థ ఉంటుందా?
తమతో పాటు ఎన్నికల ప్రచారంలో తిప్పుకున్నారు. ఇలా దాదాపు 1.06 లక్షల మంది రాజీనామాలు చేసి వైసీపీ నేతల వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో వారంతా లబోదిబోమంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామాలు చేశామని తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా వాలంటీర్స్ విషయంలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు.వాలంటీర్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించాలని స్పష్టం చేశారు.
తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. కాగా, న్నికల ప్రచార సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలను కూడా మంత్రి డోల బాలవీరాంజనేయస్వామికి అప్పగించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై వాలంటీర్లు ఆశలు పెట్టుకున్నారు.